ఫన్ రైడ్‌గా 'హంగామా 2'


ఫన్ రైడ్‌గా 'హంగామా 2'
తాజాగా 'హంగామా 2' థియేట్రికల్ ట్రైలర్ రిలీజై ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్‌తో ఆకట్టుకుంటోంది. ప్రియదర్శన్ చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన ఈ సినిమాతో శిల్పాశెట్టి రీ ఎంట్రీ ఇస్తున్నారు. జావేద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీ హీరోగా నటిస్తున్న ఇందులో ప్రణీత సుభాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమెకు ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ. ఇందులో శిల్పా శెట్టి - పరేష్ రావల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 1994లో ప్రియదర్శన్ తెరకెక్కించిన మలయాళ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'మిన్నారం' రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. డిస్నీ+హాట్ స్టార్‌లో జూలై 23à°¨ డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'హంగామా 2' ట్రైలర్‌ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశాడు. 
ఇక ఈ ట్రైలర్ చూస్తే.. ప్రణీత సుబాష్ బిడ్డకు తండ్రి ఎవరు అనే డిస్కషన్ తో ప్రారంభమవుతుంది. మీజాన్ జాఫ్రీ తన బిడ్డ కాదని అశుతోష్ రానాకు చెప్తూ కనిపించాడు. ఇందులో శిల్పా శెట్టి భర్తగా పరేష్ రావల్ నటించగా, అందమైన తన భార్యకు అందరూ లైన్ వేస్తున్నారని అనుమానపడుతున్నట్టు, మీజాన్ - శిల్పా క్లోజ్‌గా ఉండటం చూసి వారి మధ్య ఎఫైర్ ఉందని అపార్ధం చేసుకుంటునట్లు చూపించారు. ఈ క్రమంలో అనుమానం - అపార్థాలతో పాత్రల మధ్య ఏర్పడిన గందరగోళం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తోంది. శిల్పాశెట్టి కంబ్యాక్ మూవీ కావడంతో ఇందులో ఆమె పాపులర్ సాంగ్ 'చురాకే దిల్ మేరా' ను రీమేక్ చేశారట. డబుల్ హంగామా అంటూ వస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  

Related Keywords

Javed Geoffrey , Pranitha Subhash , Akshay Kumar , Shilpa Shetty , , July Direct , Bollywood Hero Akshay Kumar , பிரணித சுபாஷ் , அக்‌ஷய் குமார் , ஷில்பா ஷெட்டி , ஜூலை நேரடி ,

© 2024 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.