న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆర్థికశాఖ బుధవారం పిలుపునిచ్చింది. ‘‘మూలధనం, సమర్థవంతమైన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషించాలని నేను ఐబీఏ చైర్మన్‌ను కోరుతున్నాను. ఐబీఏ కేవలం బ్యాంకింగ్ సమస్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు నివేదించే సంఘం మాత్రమే కాదు, వృద్ధ