గులాబ్‌ బ&#

గులాబ్‌ బీభత్సం | Prajasakti
ఆదివారం రాత్రి కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన 'గులాబ్' తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగంతో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, మొబైల్ సిగల్ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలిపోయాయి.
Related Keywords
Kottur, Tamil Nadu, India, Srikakulam, Andhra Pradesh, , Centera Her, Prime Minister Aura,