Live Breaking News & Updates on Breaking hyderabad telugu news

Stay informed with the latest breaking news from Breaking hyderabad telugu news on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Breaking hyderabad telugu news and stay connected to the pulse of your community

సంబరాల ఉగాది

ఫలితాలు రాక ముందే పండుగలన్నీ వచ్చి వెళ్తే చాలా మంచిది. ఈ ఉగాది గ్రేట్‌... అలాగే వచ్చింది. ఫలితాలు వెలువడ్డా ‘ఒకరికి మోదం, ఒకరికి ఖేదం...’ తప్పదు. ఈసురోమంటూ పండుగ చేసుకుంటే ఏం బావుంటుంది. ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు మొదలెట్టని సంబరాల ఉగాది

స-బర-ల , ఉగ-ద , Eenadu , Vyakyanam , Article , General , 1302 , 121075573 , Top-news , Today-news , Today-breaking-news

బలవంతపు వసూళ్ల మహాజాడ్యం


ఉప వ్యాఖ్యానం
బలవంతపు వసూళ్ల మహాజాడ్యం
మూడు దశాబ్దాల క్రితం ముంబయి మహానగరం కరడు గట్టిన అధోజగత్‌ నేరగాళ్ల (అండర్‌ వరల్డ్‌ డాన్‌) కార్యక్షేత్రంగా పేరెన్నికగన్నది. హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లతో నాడు ముంబయిని గడగడలాడించిన వాళ్లలో ఒకడైన అరుణ్‌ గావ్లీకి రెండు పుష్కరాల క్రితం భారత ప్రజాస్వామ్య బోధివృక్షం కింద హఠాత్తుగా జ్ఞానోదయమైంది. తన పేరు చెబితేచాలు- ఎంతటివారైనా హడలిపోయి కప్పాలు కట్టేలా నేర సామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించినా, ఏదో ఒకనాడు పోలీసుల ఎదురుకాల్పుల్లో నేలరాలిపోయే ప్రమాదాన్ని గుర్తించిన అతగాడు- 1997లో అఖిల భారతీయ సేన పేరిట పార్టీ పెట్టేశాడు. తనపై మూడు డజన్లదాకా కేసులున్నా నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులనే అంగరక్షకుల్ని చేసుకొని నింపాదిగా రాజకీయ చదరంగం ఆడుతున్నాడు. ‘డాన్‌’ ముదిరి రాజకీయ నాయకుడయ్యాక వ్యత్యాసాలు చెదిరిపోయాయి. దరిమిలా పొలిటీషియన్లు మరింత నాజూగ్గా తమ కార్య కుశలతకు పదునుపెట్టి, తమ చేతికి మట్టి అంటకుండా పనులు చక్కబెట్టుకొనే పాటవ ప్రదర్శనకు సమకట్టడంలో తప్పేముంది? ప్రపంచంలోనే అత్యంత భారీగా కుబేరులు పోగుపడిన నగరాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న బృహన్‌ ముంబయిలో- ధనస్వామ్య దాదాగిరీకి సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ అమాత్యుడే పాల్పడ్డాడన్న ఆరోపణలు అక్కడి పోలీసు పెద్దల ముఖతానే వెలువడ్డాయి. ముఖేష్‌ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం నిలిపి ఉంచడంతో మొదలైన నేర కథ- రాష్ట్ర హోంమంత్రి పదవీ పీఠానికే ఎసరు తెచ్చి నేరగ్రస్త రాజకీయాల రసవద్ఘట్టాన్ని కళ్లకు కడుతోంది. అదేంటో చిత్తగించండి!
ముఖేష్‌ అంబానీ నివాసం వెలుపల భారీగా పేలుడు పదార్థాలున్న వాహనాన్ని కనుగొన్న దరిమిలా ఆ వాహన యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ హత్యకు గురి కావడం- యావత్‌ దేశాన్నీ దిగ్భ్రాంతపరచిన పరిణామం. ఆరు వారాలుగా ఆ కేసు లోతుపాతుల్ని తవ్వుతున్న ఎన్‌ఐఏ- ముంబయి పోలీసు అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేను అదుపులోకి తీసుకోవడం- కుట్రలో అతి చిక్కని చీకటి కోణం! ఇంత భారీ నేరం జరిగినా సమర్థంగా వ్యవహరించలేకపోయారంటూ ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ ఉత్తర్వులు అందుకొన్న సింగ్‌- హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన కింది అధికారులకు బలవంతపు నెలవారీ వసూళ్ల లక్ష్యాలు నిర్దేశించారంటూ ముఖ్యమంత్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న సచిన్‌ వాజే సైతం అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు మరో మంత్రి అనిల్‌ పరబ్‌పైనా బలవంతపు వసూళ్ల ఆరోపణలు గుప్పించడం పెను రాజకీయ దుమారమే రేపింది. ముంబయి హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చే ముందు రోజు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఆ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. హోంమంత్రిపై వచ్చిన అభియోగాల తీవ్రత దృష్ట్యా- వాస్తవాల్ని వెలికి తీయడానికి నిష్పాక్షిక విచారణ సాగాల్సిందేనంటూ ముంబయి హైకోర్టు సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించగానే, హోంమంత్రివర్యులు రాజీనామా చేసి నిష్క్రమించాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాల నిలుపుదలకు తాజాగా సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో- పక్షం రోజుల్లో ప్రాథమిక విచారణ పరిసమాప్తికి సీబీఐ హుటాహుటిన కదిలింది. ముంబయిలోని దాదాపు 1650 బార్లు రెస్టారెంట్ల నుంచి తలా రూ.3-3.50 లక్షల వంతున వసూలు చేసి నెలకు వందకోట్లు తనకు ముడుపు కట్టాలని హోంమంత్రి ఆదేశించారన్నది నేరాభియోగాల సారాంశం. వ్యవస్థీకృత నేరగాళ్ల వర్గంగా పోలీసుల్ని లోగడ సుప్రీం న్యాయపాలికే దునుమాడిన నేపథ్యంలో- తన కోసం ఆ మాత్రం చేయలేరా... అన్నది అమాత్యుల వారి ఆలోచన అయి ఉండవచ్చు, పాపం! ఈ దర్యాప్తు ప్రకంపనలు అనిల్‌ దేశ్‌ముఖ్‌తో ఆగవని, మరికొందరి పీఠాలూ కదులుతాయని కమలనాథులు చెబుతున్న జోస్యం- మహారాష్ట్ర రాజకీయాల్ని మరింత ఉద్విగ్న భరితం చేయడం ఖాయం!
కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన నేరానికి ప్రధానమంత్రికే 2,352 డాలర్ల జరిమానా విధించిన నార్వే పోలీసుల కర్తవ్య దీక్ష మనకు ఏమాత్రం మింగుడు పడనిది. దేశీయంగా అన్ని రకాల అవినీతికీ తల్లివేరు రాజకీయ అవినీతి. నేరగాళ్లకు అభ్యర్థిత్వాల అంబారీ కట్టే పార్టీల పుణ్యమా అని అలాంటి వాళ్లే చట్టసభలకు దర్జాగా నెగ్గుకు రాగలిగే వాతావరణమూ సువ్యవస్థీకృతమైన దేశం మనది. మొదలు మోదుగ పూస్తే, కొసకు సంపెంగ కాస్తుందా? ఇటీవలి దాకా మహారాష్ట్ర మంత్రివర్గంలో 42 మంది సచివులుంటే అందులో 27 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వారిలోనూ 18 మందిమీద హేయ నేరాలకు సంబంధించిన అభియోగాలు పెండింగులో ఉన్నాయి. ఇలాంటి సరకులో అంతర్భాగమైన ఓ మంత్రి బలవంతపు వసూళ్లకు ప్రేరేపించారన్నా, మరోమంత్రి ఓ టిక్‌టాక్‌ స్టార్‌ ఆత్మహత్య కేసులో నిందితుడిగా పదవి కోల్పోయాడన్నా ఆశ్చర్య పోవాల్సిందేముంది? తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పగల సౌలభ్యం బహుశా ఇండియాలో తప్ప వేరెక్కడుంది? దేశీయంగా 22 రాష్ట్రాలకు చెందిన 2,556 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్‌ నేరాభియోగాలున్నట్లు; మాజీల్ని కూడా కలిపితే ఆ సంఖ్య 4,442 కు చేరుతున్నట్లు కోర్టు సహాయకుడి (అమికస్‌ క్యూరీ)గా విజయ్‌ హన్సారియా నిరుడు సెప్టెంబరులో ‘సుప్రీం’ న్యాయపాలికకు నివేదించారు. ప్రత్యేక కోర్టులు పెట్టి పాపపంకిల వ్యవస్థను ప్రక్షాళించాలన్న సత్సంకల్పాలు మోతెక్కుతున్నా- ఎక్కడా శిక్షల జాడే కానరావడం లేదు!
ఒకనాటి త్యాగధనులు తమ సర్వస్వాన్నీ త్యజించి స్వాతంత్య్రం తెస్తే- ఈనాటి నేతలు సమస్త విలువల్నీ త్యాగంచేసి ధనరాసులు పోగేసుకొనే విధ్యుక్త ధర్మ నిర్వహణలో నిష్ఠగా పరిశ్రమిస్తున్నారు. కాబట్టే అవినీతి పూరిత దేశాల జాబితాలో మరో ఆరుస్థానాలు దిగజారి ఇండియా పరువుమాస్తోందిప్పుడు! ఖాకీ దండధరుల్నే వసూల్‌ రాజాలుగా మార్చి సొంతలాభం సాంతం చూసుకోవాలన్న వ్యూహం మహారాష్ట్రలో బెడిసికొట్టిందిగాని, అది వేరెక్కడా అమలు కావట్లేదని ధీమాగా చెప్పలేం! ‘దోచుకునేటంత దొరతనమున్నప్పుడు అడుక్కు తినేటంత అధవతనమేల’ అన్న తత్వాన్ని తలకెక్కించుకున్న చోట్ల వందలకోట్ల సెటిల్‌మెంట్ల దందాలు నిష్పూచీగా సాగడం లేదని ఎవరు చెప్పగలరు? భారతరత్న వాజ్‌పేయీ చెప్పినట్లు- అధికారం అవినీతిని మప్పుతోంది. విషంలో పుట్టిన పురుగుకు విషమే ఆహారమన్నట్లుగా మొత్తం వ్యవస్థనే అది అవినీతి విషతుల్యం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అమృతోత్సవాలకు సిద్ధమవుతున్న స్వాతంత్య్రం- మేడిపండును తలపించడంలో వింతేముంది?
- పర్వతం మూర్తి
జిల్లా వార్తలు
ఏ జిల్లా

బలవ-తప , వస-ళ-ల , మహ-జ-డ-య , Eenadu , Vyakyanam , Article , General , 1302 , 121074100 , Top-news , Today-news

చిప్‌ల కొరతతో... ప్రపంచం సతమతం

ప్రపంచానికి సిలికాన్‌ చిప్‌ల కరవొచ్చింది. నేడు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కార్ల వరకు; వీడియో గేమ్‌ కన్సోల్స్‌ నుంచి వాషింగ్‌ మెషీన్ల వరకు; ల్యాప్‌ టాప్‌ల నుంచి టీవీల వరకు; వెబ్‌క్యామ్‌ల నుంచి సీసీటీవీ కెమేరాల వరకు అన్నీ సిలికాన్‌ చిప్‌ల (సెమీ కండక్టర్ల)తోనే... చిప్‌ల కొరతతో... ప్రపంచం సతమతం

చ-ప-ల , క-రతత , ప-రప-చ , సతమత , Eenadu , Vyakyanam , Article , General , 1301 , 121074846 , Top-news

రష్యాతో పెరుగుతున్నదూరం


ప్రధాన వ్యాఖ్యానం
రష్యాతో పెరుగుతున్నదూరం
భారత్‌ లేకుండా అఫ్గాన్‌ శాంతి ప్రక్రియ
అంతర్జాతీయ రాజకీయ యవనికపై నిస్సందేహంగా రెండు ప్రధాన శిబిరాలు ఆవిష్కృతమయ్యాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తుంటే- మరొకటి అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏ శిబిరంవైపూ పూర్తిస్థాయిలో మొగ్గు చూపకుండా ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్ని కొనసాగిస్తున్న భారత్‌ ఆ పంథాను మరెంతోకాలం నిలుపుకొనే అవకాశాలు కనిపించడం లేదు. సంస్కృతీ సంప్రదాయాల్లో ఇండియాతో అనేక సారూప్యతలున్న రష్యా ఇటీవల పాకిస్థాన్‌తో జట్టుకట్టడం గమనార్హం. ఇది భారత్‌కు కలవరం కలిగించే పరిణామం. మరోవైపు అఫ్గానిస్థాన్‌ శాంతి చర్చల్లో భారత్‌కు పాత్ర లేకుండా రష్యా దారులు మూసివేసిందనే ప్రచారానికి అంతర్జాతీయ మాధ్యమాలు తెరతీశాయి.
వాతావరణాన్ని తేలిక చేయడంలో భాగంగా రష్యా ఇటీవల ఒక ప్రకటన చేస్తూ... అఫ్గాన్‌లో శాంతి స్థాపన అంశంపై సందర్భం వచ్చినప్పుడు భారత్‌ లోతైన పాత్రను పోషిస్తుందంటూ పేర్కొంది. ‘సందర్భం వచ్చినప్పుడు’ అంటే ప్రస్తుతానికి భారత్‌కు ఆ శాంతి ప్రక్రియలో స్థానం లేనట్లేనా అన్న అనుమానం కలగక మానదు. అఫ్గాన్‌లో శాంతిస్థాపనపై మార్చి 18న మాస్కో చర్చలు నిర్వహించనుంది. రష్యా, చైనా, అమెరికా, పాకిస్థాన్‌ ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో మార్చి 18న మాస్కోలో అఫ్గానిస్థాన్‌ అంతర్గత శాంతిపరిరక్షణపై చర్చించేందుకు ఒక సాధారణ సమావేశం నిర్వహిస్తామని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు, అఫ్గాన్‌ అత్యున్నత జాతీయ సయోధ్య మండలి, ప్రముఖ రాజకీయవేత్తలు, ఖతార్‌ ప్రతినిధులు, తాలిబన్‌ ఉద్యమకారులు ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారత్‌ పేరు ప్రస్తావించకపోవడాన్ని బట్టి ఈ కార్యక్రమంలో ఇండియాకు స్థానం లేదనే తెలుస్తోంది. భారత్‌ వ్యూహాత్మక తటస్థత విధానాన్ని విడనాడి, స్పష్టమైన వైఖరితో ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందా అన్న ప్రశ్నలు రేకెత్తించిన ప్రకటన అది.
వాస్తవానికి రష్యా ఈ చర్చలకు భారత్‌ను దూరంగా పెట్టడానికి చాలా కారణాలున్నాయి. మొట్టమొదటి కారణమేమిటంటే, ప్రస్తుతం భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు భేషుగ్గా ఉన్నాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల చతుర్భుజి (క్వాడ్‌)- హిందూ మహా సముద్రం, పసిఫిక్‌ ప్రాంతాల్లో అమెరికా ఇతర పశ్చిమ దేశాల ప్రయోజనాలకు అండగా నిలుస్తోంది. నానాటికీ విస్తరిస్తున్న చైనా ప్రభావానికి, దుందుడుకుతనానికి కళ్ళెం వేస్తోంది. అమెరికాలో బైడెన్‌ నాయకత్వంపై రష్యాకు ఉన్న వ్యతిరేకతవల్ల ఆ దేశం చైనాతో లోతైన సంబంధాలు నెరపుతోంది. ఈ చర్చల్లో భారత్‌కు ప్రాధాన్యమిస్తే ఆ మేరకు అమెరికాకూ చర్చల్లో వాటా కల్పించినట్లవుతుంది. రెండో కారణమేమిటంటే- ప్రస్తుతం రష్యా, చైనాల సంబంధాలు వంకపెట్టలేనివిగా ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన ఘర్షణలు భారత్‌, చైనాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా మార్చాయి. సరిహద్దుల్లో ఇరు పక్షాల మధ్య ఎన్నో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఇబ్బంది కలిగించే విధంగా- అఫ్గాన్‌ శాంతి చర్చల జాబితాలో భారత్‌కు చోటు కల్పించడం సరికాదని రష్యా భావించింది.
మూడోది- అఫ్గాన్‌ శాంతి చర్చల్లోనూ, ఒప్పందాల అనంతరం చోటుచేసుకోబోయే అభివృద్ధి కార్యకలాపాల్లోనూ తన ప్రమేయమే ప్రబలంగా ఉండాలని రష్యా బలంగా కోరుకొంటోంది. అలాంటప్పుడు భారత్‌కు చర్చల్లో చోటు కల్పిస్తే- ఈ కృషితోపాటు, తదనంతర అభివృద్ధి పరిణామాల్లోనూ పరోక్షంగా అమెరికాను భాగస్వామిగా చేసినట్లే అవుతుంది. దానివల్ల తన ప్రమేయం కుదించుకుపోతుందని రష్యా భావిస్తోంది.
నాలుగోది- పశ్చిమ ఆసియాలో రష్యా అమెరికాల ప్రయోజనాలు పరస్పరం పూర్తిగా భిన్నమైనవి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలో పశ్చిమాసియాకు సంబంధించి భారత్‌ చాలావరకు అమెరికా పంథాలోనే ముందుకు సాగింది. దాంతో సంప్రదాయంగా ఇరాన్‌తో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు కొంతమేర బీటలు వారాయి. అయిదోది- అఫ్గానిస్థాన్‌ను తమ ‘పెరటి దేశం’గా రష్యా భావిస్తోంది. పశ్చిమాసియాకు ముఖద్వారంగా ఉన్న అఫ్గాన్‌- భవిష్యత్తులో రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమవుతుందన్నది ‘మాస్కో’ నాయకత్వం అంచనా. ఈ స్థితిలో అఫ్గాన్‌ శాంతి చర్చల్లో భారత్‌కు భాగం కల్పిస్తే అది అమెరికాకు మేలు చేయడంతోపాటు- తన మిత్రదేశమైన పాకిస్థాన్‌నూ ఆందోళనకు గురిచేసినట్లు అవుతుంది. ఈ కారణాలవల్ల ఆధిపత్య నిరూపణే ధ్యేయంగా అఫ్గాన్‌లో సమావేశానికి రష్యా సంసిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు- భారత్‌, రష్యాలమధ్య సన్నటి అడ్డురేఖను సృష్టించగలిగాయనే చెప్పాలి!
- సంజీవ్‌ బారువా
జిల్లా వార్తలు
ఏ జిల్లా

రష-య-త , ప-ర-గ-త-న-నద , Eenadu , Vyakyanam , Article , General , 1301 , 121054703 , Top-news , Today-news , Today-breaking-news

బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ


తాజా వార్తలు
Published : 07/03/2021 01:40 IST
బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌, టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా ప్రేమలో మునిగిపోయారని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్‌ కొట్టిపారేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె వారిద్దరూ ప్రేమలో ఉన్నారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే అనుపమ తండ్రి క్రికెట్‌కు వీరాభిమాని అని, అందుకే ఒక సందర్భంలో బుమ్రాను కలుసుకున్నారే తప్ప అందులో మరే ఉద్దేశమూ లేదని స్పష్టతనిచ్చారు. ఆ సమయంలో షూటింగ్‌ కోసం బుమ్రా ఉన్న హోటల్లోనే అనుపమ బస చేయాల్సి రావడంతో ఈ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.
ఈ ఊహాగానాలను తమ కుటుంబం అంత సీరియస్‌గా తీసుకోవట్లేదని అనుపమ తల్లి తెలిపారు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి బుమ్రా తప్పుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈ పెళ్లి వదంతులు మొదలయ్యాయి. మొత్తానికి అనుపమ విషయంలో ఆమె తల్లి పూర్తి స్పష్టతచ్చింది. మరోవైపు బుమ్రాతో స్టార్‌ స్పోర్ట్స్ యాంకర్‌ సంజన గణేశన్‌ ఏడడుగులు వేయబోతుందని మరో ప్రచారం మొదలైంది. ఈ వార్తలోనైనా నిజం ఉందా? లేదా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి

బ-మ-ర-త , ప-ళ-ల , అన-పమ , క-ట-బ , సభ-య-ల , క-ల-ర-ట , Eenadu , Latest-news , Anupama , Wedding , With