Live Breaking News & Updates on Guntur court

Stay informed with the latest breaking news from Guntur court on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Guntur court and stay connected to the pulse of your community

New Delhi : జడ్జిలను దూషించారనే ఆరోపణలపై మరో నలుగురుపై సిబిఐ ఛార్జిషీట్లు

New Delhi : జడ్జిలను దూషించారనే ఆరోపణలపై మరో నలుగురుపై సిబిఐ ఛార్జిషీట్లు
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Guntur , Andhra-pradesh , India , A-guntur-court , Ap-high-court , Guntur-court , August-vijayawada , குண்டூர் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , அப்-உயர்-நீதிமன்றம்

మంత్రిగారూ.. 'ఆర్టికల్-164' చదువుకోండి: రఘురామ

మంత్రిగారూ.. 'ఆర్టికల్-164' చదువుకోండి: రఘురామ
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Kurnool , Andhra-pradesh , India , Andhra , United-states , Delhi , Hyderabad , Guntur , Guntur-court , Wednesday-his ,

రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ సమర్పణకు గడువు పొడిగింపు : సుప్రీంలో రఘురామ పిటిషన్‌ విచారణ

రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ సమర్పణకు గడువు పొడిగింపు : సుప్రీంలో రఘురామ పిటిషన్‌ విచారణ
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Guntur , Andhra-pradesh , India , Supreme-court , Guntur-court , Supreme-court-may , Guntur-judge , குண்டூர் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , உச்ச-நீதிமன்றம்

మానవీయ పరిష్కారం


మానవీయ పరిష్కారం
20 ఏళ్ల క్రితం విడిపోయిన దంపతులను కలిపిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ఇద్దరితో తెలుగులో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించిన సీజేఐ
ఈనాడు, దిల్లీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మానవీయ సంప్రదాయానికి తెరతీశారు. రెండు దశాబ్దాల క్రితం విడిపోయి, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దంపతులను తానే చొరవ తీసుకుని కలిపారు. విభేదాలు మరిచిపోయి భావిజీవితం గడిపేలా ఓ కుటుంబపెద్దలా వారికి సర్దిచెప్పారు. బుధవారం సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల కాలంలో న్యాయప్రక్రియలో మధ్యవర్తిత్వం ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతున్న సీజేఐ.. తన నేతృత్వంలోని ధర్మాసనమే వేదికగా ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లయి, బిడ్డ పుట్టిన ఏడాదికే విడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కళ్లెం శ్రీనివాసశర్మ, శాంతి దంపతులను ఒక్కటి చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టులో న్యాయవాదులే తప్ప కక్షిదారులను విచారించే పద్ధతి లేకపోయినా ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత చొరవ తీసుకొని భార్యాభర్తలిద్దర్నీ కోర్టు ముందుకు రమ్మని వారి మనోగతాలను తెలుసుకున్నారు. కలిసి ఉండాలన్న వారి మనోభావాలను అర్థం చేసుకొని ఆ మాటను ఒకరికొకరు చెప్పేలా ఒప్పించి ఒక్కటి చేశారు. బేషరతుగా భార్య, బిడ్డను చూసుకుంటానని కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించాలని శ్రీనివాసశర్మను ఆదేశించారు. భర్త సరిగా చూసుకుంటే చాలు అంతకుమించి కావాల్సిందేమీ లేదని చెప్పిన భార్యకు అంతకుముందు భర్తపై పెట్టిన 498ఎ కింద పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇద్దరూ అందుకు అంగీకరించడంతో రెండు వారాల గడువిచ్చి విచారణను వాయిదా వేశారు. ప్రధాన న్యాయమూర్తి సూచనలతో సహచర న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా ఏకీభవించారు.
పూర్వాపరాలివీ..
ప్రస్తుతం గుంటూరు జిల్లా గురజాల డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న కళ్లెం శ్రీనివాస శర్మకు 1998లో శాంతితో వివాహమైంది. 1999లో కుమారుడు పుట్టాడు. ఇంట్లో గొడవల కారణంగా 2001లో విడిపోయారు. భర్త, ఆయన కుటుంబసభ్యులు తనపై దాడి చేశారంటూ శ్రీనివాసశర్మ, ఆయన సోదరి, తల్లిపై శాంతి 498ఎ కింద కేసు పెట్టారు. కేసును విచారించిన గుంటూరు 6వ అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ శ్రీనివాస శర్మకు ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. మిగిలిన నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు. గుంటూరులోని ఫస్ట్‌ అప్పిలేట్‌ కోర్టు కూడా ఆ శిక్షను ఖరారు చేసింది. శ్రీనివాసశర్మ 2010లో హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆ శిక్షను తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ శాంతి 2011లో సుప్రీంకోర్టుకెళ్లారు. అయితే భార్యాభర్తల మధ్య విడాకులు మంజూరు కానందున మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమని సూచిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేసును 2012లో హైకోర్టు మీడియేషన్‌ సెంటర్‌కు పంపింది. అక్కడ సయోధ్య కుదరకపోవడంతో కేసు మళ్లీ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఫిబ్రవరి 18న ఈ కేసు జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధర్మాసనం వద్దకు వచ్చింది. 2001 నుంచి భార్యాభర్తలు విడిగానే ఉన్నా ప్రతివాది శ్రీనివాసశర్మ భార్యాబిడ్డ కోసం నెలవారీగా మెయింటెనెన్స్‌ ఇస్తున్నారని, ఇప్పుడు ఆయన శిక్షను పెంచి జైలుకు పంపితే ఉద్యోగం పోతుంది, దానివల్ల భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దానివల్ల ఇద్దరూ నష్టపోతారని చెప్పారు. మంగళవారం ఈ కేసు ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు ఈ వివాదాన్ని ఇద్దరి అంగీకారంతో పరిష్కరిద్దామని సీజేఐ న్యాయవాదులకు చెప్పి, బుధవారం నాటికి ఇద్దర్నీ వీడియో కాన్ఫరెన్స్‌లోకి రమ్మని సూచించారు. ఇద్దరూ ధర్మాసనం ముందుకు రావడంతో వారితో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. తనతోపాటు ఉన్న మరో న్యాయమూర్తికి అర్థమయ్యేందుకు వీలుగా ఆంగ్లంలో మాట్లాడగలరా? శాంతిని అడిగారు. తమకు తెలుగు తప్ప మరో భాష రాదని చెప్పడంతో జస్టిస్‌ ఎన్‌వీ రమణ సహచర న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అనుమతితో వారితో తెలుగులో మాట్లాడారు. ఆ సారాంశాన్ని ఆయనకు అనువదించి చెప్పారు.
సంభాషణ ఇలా..
ప్రధాన న్యాయమూర్తి: మీ భార్యాభర్తల మధ్య తగాదాలున్నాయని 2001లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మీ ఆయన్ను జైలుకు పంపాలంటే పంపుతాం. రెండు, మూడు నెలలో.. నాలుగు నెలలో జైల్లో ఉండి తర్వాత బయటికొస్తారు. జైలుకెళ్లడంతో ఆయన ఉద్యోగం పోతుంది. తద్వారా మీకు వచ్చే మెయింటనెన్స్‌ కూడా రాదు. ఇప్పుడు మీకేం కావాలి? ఆయన జైలుకెళ్లడమా? మీకు మెయింటనెన్స్‌, ఇతర అంశాలా?
పిటిషనర్‌ శాంతి: నాకు డబ్బులొద్దు. అవి నాకు భర్తను, నా బిడ్డకు తండ్రిని తెచ్చిపెట్టలేవు. గడిచిపోయిన 20 ఏళ్ల జీవితాన్ని కూడా తెచ్చిపెట్టలేవు.
ప్రధాన న్యాయమూర్తి: మరేం చేద్దాం. మీరు ఆయనతో ఉంటారా?
శాంతి: ఉంటాను సర్‌.
ప్రధాన న్యాయమూర్తి: కలిసి ఉంటారా? విడాకులు కూడా వద్దంటారా?
శాంతి: నాకు విడాకులు కూడా వద్దు సర్‌.
ప్రధాన న్యాయమూర్తి: ఈ అప్పీల్‌లో శిక్ష పడితే ఆయన జైల్లో ఉంటారు కదా?
శాంతి: ఆయనలో మార్పు వచ్చి.. నన్ను, నా బిడ్డను సరిగా చూసుకుంటానంటే నేను కేసు ఉపసంహరించుకుంటాను సర్‌.
ప్రధాన న్యాయమూర్తి: (ప్రతివాది తరఫు న్యాయవాది రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి) మీ క్లయింట్‌ ఆమెను చేరదీసి దాంపత్య జీవితం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారా?
రామకృష్ణారెడ్డి: కేసు ఉపసంహరించుకుంటూ ఆమె కోర్టుకు దరఖాస్తు చేయనివ్వండి. భార్యతో కలిసి ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
ప్రధాన న్యాయమూర్తి: ఆ తర్వాత మీ క్లయింట్‌ ఆమెను సరిగా చూసుకోవాలి.
రామకృష్ణారెడ్డి: కచ్చితంగా సర్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ నేరంపై ఫిర్యాదు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఆమె కేసును ఉపసంహరించుకొని భర్తతో కలిసి ఉండొచ్చు.
జస్టిస్‌ సూర్యకాంత్‌: ఎలాంటి షరతులూ లేకుండా భార్యతోపాటు, కుమారుణ్ని చేరదీసి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇస్తూ ప్రమాణపత్రంతో కలిపి ఆయనే దరఖాస్తు చేయాలి. దాన్ని ఆమోదిస్తూ భార్య కూడా తాను కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అఫిడవిట్‌ వేయాలి.
రామకృష్ణారెడ్డి: ఆ మేరకు మేం ఈ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పిస్తాం.
జస్టిస్‌ సూర్యకాంత్‌: ఈ కేసులో భర్తకు శిక్షపడింది. అందువల్ల ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు భేషరతుగా వారిని స్వీకరించడానికి వస్తే తప్ప పరిస్థితులు కుదుటపడవు.
రామకృష్ణారెడ్డి: ఎలాంటి షరతులు లేకుండా ఆమెతో కలిసి ఉంటారని ప్రమాణపత్రం దాఖలు చేస్తాం.
ప్రధాన న్యాయమూర్తి: మీరేమంటారు?
శాంతి: ఏ ఇబ్బందులు లేకుండా నన్నూ, నా బిడ్డనూ చూసుకుంటే మాకు సమ్మతమే సర్‌.
ప్రధాన న్యాయమూర్తి: ఇబ్బందులన్నవి ఇద్దరి మధ్య అవగాహనను బట్టి ఉంటాయమ్మా. కోర్టు ఉత్తర్వులున్నాయి కదా అని చిన్న, పెద్ద విషయాలకు మళ్లీ ఇబ్బంది పెడితే...
శాంతి: నేను అలా ఏమీ చేయను.
ప్రధాన న్యాయమూర్తి: మీరు కూడా అలా ఒక అఫిడవిట్‌ ఇవ్వండి. చిన్నచిన్న విషయాలకు గొడవ పడకుండా, పరస్పరం అర్థం చేసుకొని ఒకర్నొకరు చూసుకోవాలి. జరిగిపోయినవి జరిగిపోయాయి. 20 ఏళ్లు కష్టపడ్డారు. అంతకుమించి ఏమీ లేదు. కనీసం బిడ్డ కోసమైనా చక్కగా ఉండండి. శర్మగారూ మీరు ఇకనైనా సరిగా ప్రవర్తించండి. భార్యను వేధించకండి.
Tags :

India , Guntur , Andhra-pradesh , Rao-sharma , Supreme-court , Guntur-court , High-court , Dilli-india-main , Guntur-district , Tails-his , Telugu-states , இந்தியா

సుప్రీంలో తెలుగువాణి | Prajasakti

సుప్రీంలో తెలుగువాణి | Prajasakti
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

New-delhi , Delhi , India , Guntur , Andhra-pradesh , Supreme-court , Guntur-court , High-court , Supreme-court-wednesday , Ramana-her , புதியது-டெல்ஹி

ప్యానెల్‌ లాయర్లకు శిక్షణ తరగతులు


Jul 25,2021 00:01
వర్చ్యువల్‌ పద్ధతిలో అవగాహన కల్పిస్తున్న రత్నకుమార్‌, తదితరులు
ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం జిల్లాలోని ప్యానెల్‌ లాయర్లకు వర్చ్యువల్‌ పద్ధతిలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్‌ తన ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జువెనైల్‌ జస్టిస్‌ కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆక్ట్‌, 2015, సీనియర్‌ సిటిజన్స్‌ ఆక్ట్‌, 2007, అట్రాసిటీ నిరోధక సవరణ చట్టం, మాస్టర్‌ ట్రైనర్‌ సుబ్బారావు, రైట్స్‌ అఫ్‌ ప్రిసనర్స్‌ గురించి మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీనివాసరావు అవగాహన కల్పిచారు. పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ గురించి పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ రాంబాబు, ప్లీడింగ్స్‌ అండ్‌ డ్రాఫ్టింగ్స్‌ గురించి ఫామిలీ కోర్ట్‌ జడ్జి పార్ధసారధి, ఎవిడెన్స్‌ ఆక్ట్‌, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌, ఎకా జుడిషియల్‌ కన్ఫెషన్‌, సర్కమ్‌ స్టెన్షిల్‌ ఎవిడెన్స్‌, మరణ వాంగ్మూలం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం, 2019, గురించి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వాసుదేవన్‌ వివరించారు. నల్సా స్కీమ్స్‌, విక్టిమ్‌ కంపెన్సషన్‌ స్కీం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నకుమార్‌ తెలిపారు.
తాజా వార్తలు

Guntur , Andhra-pradesh , India , Guntur-court , News-guntur , Saturday-district , District-main , Judge-parthasarathy , Conservation-act , Scheme-district , குண்டூர்

'ఫ్లాయిడ్‌' తరహా 'న్యాయాన్ని' మనం ఆశించవచ్చా!


Jun 30,2021 06:52
    అమెరికాలో సంచలనం సృష్టించిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీస్‌ మాజీ అధికారి డెరిక్‌ చౌవిన్‌ కు ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష... తెలంగాణలో పోలీస్‌ కస్టడీలో దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌, పోలీసుల సస్పెన్షన్‌.. వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు 'నేరం-న్యాయం-శిక్ష-పరిహారం'పై మరోసారి చర్చకు దారి తీశాయి. దళితులు, గిరిజనులు, ముస్లింలపై పోలీసుల వివక్షతోపాటు...చుండూరు లాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం అందని ద్రాక్షగా మిగిలిన వాస్తవాలను మరోసారి గుర్తు చేశాయి.
     అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన 25 మే 2020న జరగగా సరిగ్గా ఒక సంవత్సరం 32 రోజుల తరువాత తీర్పు వచ్చింది. 'ఈ తీర్పు భావోద్వేగాలతో, సానుభూతితో ఇచ్చింది కాదు. కానీ, ఫ్లాయిడ్‌ కుటుంబంతో పాటు అలాంటి ఎన్నో కుటుంబాలు అనుభవించిన తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు' అని జడ్జి పీటర్‌ కాహిల్‌ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం విషయంలో, సిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ మిన్నియాపాలిస్‌, ఫ్లాయిడ్‌ కుటుంబం మధ్య ఒప్పందం జరిగింది. దీని కింద, సిటీ కౌన్సిల్‌ ఫ్లాయిడ్‌ కుటుంబానికి 27 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.196 కోట్లు) ఇచ్చింది.
    తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు, ముస్లింలపై వివక్షతో అనేక దాడులు జరిగాయి. కొన్నిసార్లు సామూహిక హత్యలకు దారి తీశాయి. అయితే చాలా కేసుల్లో వాటిని రుజువు చేయడంలో ఇబ్బందులు ఎదురవడంతో దోషులు బయటపడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య, రోహిత్‌ వేముల ఆత్మహత్య, తమిళనాడులో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహ్రాన్‌పూర్‌ హింస...ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే చాలా ఘటనలు వెలుగు చూడకుండానే కనుమరుగవుతున్నాయి.
    దేశంలో బిజెపి అధికారం లోకి వచ్చాక దళితులు, గిరిజనులు, ముస్లింలపై దాడులు పెరిగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దళితులు, గిరిజనులు, ముస్లింలపై దాడుల్లో బాధితులకు అనుకూలంగా వచ్చిన తీర్పులు అంతంత మాత్రమేనని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. కేసులు, చార్జ్‌షీట్‌ నమోదులో పోలీసుల వైపు నుంచి జరిగే జాప్యంతో నిందితులు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. చుండూరు ఘటనపై వెల్లువెత్తున ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, ఏడేళ్ల తర్వాత ఎ.పి హైకోర్టు 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు తీర్పు ఇచ్చింది. దీంతో బాధితుల బంధువులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఇప్పటికీ కేసు నడుస్తోంది. కారంచేడు ఘటనలో గుంటూరు కోర్టు ఐదుగురికి యావజ్జీవ కారాగారశిక్ష, 46 మందికి 3 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద 1998 జూలై 24న ఇచ్చిన తీర్పులో కింది కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్ట్‌ లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, 2008 డిసెంబర్‌ 19న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో ఇక మిగిలిన వారిలో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు, మరో 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో 20 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నట్టు దళిత సంఘాలు చెబుతున్నాయి. 2017-18 హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం కేవలం 16.3 శాతం శిక్షలు పడినట్టు నమోదైంది. చాలా కేసుల్లో కింది స్థాయి న్యాయస్థానాలు విధించిన శిక్షలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టివేసి, నిందితు లను నిర్దోషులుగా వదిలిపెడుతున్నాయి. చాలా సందర్భాలలో సాక్ష్యాధారాలను రూపుమాపుతున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని, బలవంతపు రాజీలు చేస్తున్నారని, విచారణలు సక్రమంగా జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
    భారతదేశంలో దళితులు, గిరిజనుల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా నిందితులు ఎలాగోలా తప్పించుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమలులోనే పాలకుల చిత్తశుద్ధిలేమి స్పష్టంగా కనిపిస్తోంది. నేరాలు జరగడం, కేసులు వీగిపోవడంలో రాజకీయాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. న్యాయ, అన్యాయాలను ప్రభావితం చేస్తున్నాయి. ముందుగా పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి. నేరాలను రికార్డు చేయడంతోనే సరిపుచ్చకుండా, దానిపై చర్యలు తీసుకోవడం, కఠినంగా వ్యవహరించడం ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు. అంతేకాకుండా న్యాయం జరిగే వరకు బాధితులు, సాధారణ ప్రజలు, ఆందోళనకారులు ఒక్కటై ఉద్యమించి, ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది. రాజకీయ ప్రభావం లేని పాలకులు.. పాలకుల ఒత్తిడి లేని పోలీసులు.. దీనికి తోడు న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలిచే ఉద్యమకారులు, ప్రజలు, పక్షపాతం-ఒత్తిడి లేకుండా తీర్పు చెప్పే న్యాయస్థానాలు ఉంటే భారతదేశంలో కూడా న్యాయం సత్వరం అందే అవకాశం వుంటుంది.
 

United-states , India , Telangana , Andhra-pradesh , Tamil-nadu , Guntur , States-dalits , P-high-court , Supreme-court , Sentencing-the-supreme-court , Guntur-court , High-court

బెయిలు షరతులు ఉల్లంఘించలేదు!

బెయిలు షరతులు ఉల్లంఘించలేదు!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

His-parliament , Supreme-court , Guntur-court , High-court , உச்ச-நீதிமன்றம் , உயர்-நீதிமன்றம் ,

ఎంపీని కొట్టడమేంటి?

ఎంపీని కొట్టడమేంటి?
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Andhra , Andhra-pradesh , India , Guntur-district , Amravati , Maharashtra , Guntur , Supreme-court , Issue-high-court , Guntur-court , High-court