Live Breaking News & Updates on ఈన డ

Stay informed with the latest breaking news from ఈన డ on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in ఈన డ and stay connected to the pulse of your community

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

ఈన-డ- , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime


సోమవారం, జూన్ 14, 2021
సినీ నటి కీర్తి సురేష్‌ తాను ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రశాంతంగా ఉన్నట్లు పోస్టు చేశారు.
ఉపాసన తన భర్త రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. వారి వివాహ తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా ఈ ఫొటోను పోస్టు చేశారు.
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో మే పుష్పాలు విరబూశాయి. మే నెలలో పూయాల్సిన పూలు జూన్‌లో పూసి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
వాహకులకు ప్రత్యేకించిన వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకాలు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యక్తిగత చరవాణికి ఓటీపీ పంపే విధానం అమలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఓ కేంద్రంలో ఓటీపీ చూపిస్తున్న మహిళ.
లాక్‌డౌన్‌ సడలింపు సమయం పెంచడంతో ఆదివారం ప్రజలు ఉద్యానాల బాటపట్టారు. నెక్లెస్‌రోడ్డులోని పార్కులో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. చిన్నారులు ఆటల్లో మునిగితేలారు.
గతేడాది నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి బాటకు అందాన్ని తీసుకొచ్చాయి. వరంగల్‌లోని మహేశ్వరం బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో తీసిన చిత్రమిది.
వానరాల బెడదను తప్పించేందుకు నిర్మల్‌ శివారులో కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిని పట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసి వదిలేస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ శాఖ కార్యాలయంలో వాటిని పట్టేందు కోసం బోనులను ఏర్పాటు చేశారు. అయితే ఓ కోతి మాత్రం తెలివిగా అందులోకి వెళ్లి చిక్కకుండా దర్జాగా ఆహారాన్ని బయటకు తెచ్చుకొని తింటూ అటవీ అధికారుల సహనాన్ని పరీక్షించింది. రెండోసారి వెళ్లి చిక్కక తప్పలేదు. బయటకు వచ్చేందుకు శతవిధాల ప్రయత్నించి చేసేది లేక అలా కూర్చున్న చిత్రాలు నిర్మల్‌ అటవీ శాఖ కార్యాలయంలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కాయి.
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో త్వరలో ప్రతిష్ఠించనున్న ఆది శంకరాచార్యుడి విగ్రహాన్ని మైసూరు శిల్పి యోగిరాజ్‌ సిద్ధం చేశారు. మైసూరులోని శిల్పకళా శిబిరంలో దాదాపు 7 నెలలపాటు శ్రమించి.. కూర్చున్న భంగిమలో విగ్రహాన్ని రూపుదిద్దారు. కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యుడి సమాధివద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆయన పిలుపు మేరకు దాదాపు 50 మంది శిల్పులు శంకరాచార్యుడి విగ్రహ నమూనాల్ని ప్రదర్శించారు. యోగిరాజ్‌ నమూనాను ఎంపిక చేసి 12 అడుగుల ఎత్తైన శంకరాచార్యుడి విగ్రహం తయారీ బాధ్యతను అప్పగించారు. ఆయన నల్లరాతితో ఆది శంకరాచార్యుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 17న మైసూరు నుంచి ఈ విగ్రహాన్ని కేదార్‌నాథ్‌కు తరలిస్తారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తడుకు గ్రామ పరిధిలోని గూళూరు చెరువు తూముపై ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ఆకాశం మేఘావృతమవడంతో ఆదివారం ఇలా కనిపించింది.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం వద్ద ఆనందయ్య మందు కోసం ఆదివారం ప్రజలు బారులు తీరిన దృశ్యం.
విజయవాడ ఎస్‌బీఐ కాలనీ-1లోని ఓ ఇంట్లోని పనస చెట్టు కింద నుంచి కాయలు కాస్తూ ఆకర్షిస్తోంది. 20 ఏళ్ల కిందట ఈ చెట్టు నాటినట్లు యజమాని సుగుణ తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబరులో పూత వచ్చి.. మే నెలలో 50కు పైగా కాయలను ఇస్తోందని చెప్పారు. చెట్టు కింది నుంచి కాస్తున్న కాయలను అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -ఈనాడు, విజయవాడ
కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గగానే పాఠశాలలు తెరవడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. బడి తెరవగానే జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా వీటిని అందించనున్నారు. కృష్ణా జిల్లాకు 23లక్షల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 12లక్షల వరకూ వచ్చాయి. వీటిని విజయవాడలోని గోదాములో ఉంచారు. ఆర్టీసీ సరకు రవాణా బస్సుల ద్వారా వీటిని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులకు, అక్కడి నుంచి పాఠశాలలకు అందించనున్నారు. - ఈనాడు, అమరావతి
ఈ చిత్రంలో ఉన్న వారంతా ఏదో సమావేశం కోసమో ఏదైనా చర్చ కోసమో వచ్చి ప్రారంభం కాలేదని ఇలా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారనుకుంటే పొరపాటే. వారంతా ఫోన్‌ సిగ్నల్స్‌ కోసం ఇలా రోడ్డెక్కారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని 13 గ్రామాల ప్రజలు సుమారు ఏడు వేల మంది సెల్‌ఫోన్‌ మాట్లాడాలనుకుంటే ఇలా చిఛ్‌దరి ఖానాపూర్‌లోని రోడ్డెక్కాల్సిందే. - ఈనాడు, ఆదిలాబాద్‌ - న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ గ్రామీణం
తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, నగరవాసుల వాహనాలతో తిరుపతిలో రద్దీ పెరుగుతోంది. ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు తితితే, తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా గరుడ వారధి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు నుంచి చూస్తే తిరునగరిలోని గరుడ వారధి ఇలా కనిపిస్తోంది.
శ్రీకాకుళంలోని నరసన్నపేట కోవెల వీధికి ఎదురుగా ఉన్న ఓ పెట్రోల్‌ బంకు సమీపంలో గోవు నెల రోజులుగా ఓ పంది పిల్లకు పాలిస్తూ ఆకలి తీరుస్తోంది. అటుగా వెళ్లే వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఆదివారం కర్ణాటకలో కురిసిన వర్షానికి హంపీ విరూపాక్షేశ్వర ఆలయ ప్రతిబింబం ఇలా కనిపించింది.
పని చేసుకుని పొట్ట పోసుకుందామంటే.. పనిచ్చే వారు కరవయ్యారు. ఆకలి తీరే మార్గం లేక ఆటో వచ్చినా, ఆడీ కారు వచ్చినా అన్నార్తులు మూగిపోతున్నారు. వారిని నియంత్రించడం దాతలకు కష్టమవుతోంది. ఆదివారం బంజారాహిల్స్‌లో కనిపించిన దృశ్యమిది.
శివారు జిల్లాల నుంచి నేరేడు(గిన్నె)పండ్లు నగరానికి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొజంజాహి మార్కెట్‌ వద్ద కనిపించిన దృశ్యమిది.
కొంగుతో వీపున చిన్నారిని కట్టి, నెత్తిన కట్టెల మోపుని కుడి చేతితో పట్టుకుని, ఎడమ చేతిలో మంచినీటి కడవ మోస్తూ శ్రమ సౌందర్యానికి గీటురాయిలా నిలిచే అడవిబిడ్డలు ఓరుగల్లుకు వచ్చినట్లున్న ఈ చిత్రాలు.. వరంగల్‌ నగరంలోని ములుగు రోడ్డులో ఏర్పాటు చేశారు.
కరోనా కారణంగా పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో ఖాళీగా ఉండటం ఎందుకని పలువురు విద్యార్థులు ప్రస్తుతం పొలానికి వెళ్లి తల్లిదండ్రులకు సాయపడుతున్నారు. మరికొందరు పొలం పనులు నేర్చుకొంటున్నారు. మహబూబ్‌నగర్‌ మండలం ఇప్పలపల్లిలో కనిపించిందీ దృశ్యం.
పిల్లలకు పాఠాలు నేర్పే విధంగా ఉండటం కోసం చిత్రకారుడు చందు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట పాఠశాల గోడలపై చేనేత ప్రపంచాన్ని సృష్టించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బట్టలు ఏ విధంగా తయారు అవుతాయనేది పుస్తకాల్లో కాకుండా నేరుగా గోడలపై చిత్రాలు వేసి చూపించారు.
జులై 12న పూరీలోని జగన్నాథ ఆలయంలో జరుగనున్న రథయాత్ర కోసం సిద్ధమవుతున్న చక్రాలు.
యాదాద్రిలోని లక్ష్మీ నారసింహస్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. మరిన్ని మంచి చిత్రాలు త్వరలోనే విడులవుతాయన్నారు.
మరిన్ని

ఈన-డ- , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు : ఈనాడు ఆదివారం | ఈనాడు సండే మ్యాగజిన్


ఈనాడు ఆదివారం : Read Sunday Magazine ఈనాడు : ఈనాడు ఆదివారం | ఈనాడు సండే మ్యాగజిన్ | రాశి ఫలం

Ireland , Sari-jewellery , ఈన-డ- , Enadu , Sundaymagazine , Rticle , 21000564 , Enadu-adivaram , Enadu-sunday-magazine , Unday-story , Op-stories