New Delhi: కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను మిక్సింగ్ పద్ధతిలో ఇచ్చి ఫలితాలను విశ్లేసించేందుకు ఉద్దేశించిన ఓ పరిశోధనకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ), వెళ్లూర్ ఈ పరిశోధనలకు వేదిక కానుంది. దాదాపు 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఈ పరిశోధన జరగనుంది.