హిమాచల్‌ప్రదేశ్ : సహనం కోల్పోయి ఇద్దరు ఎస్పీలు కొట్టుకున్న ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్ సిఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా... కులు విమానాశ్రయం సమీపంలో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయమై సిఎం భద్రతా సిబ్బంది, కులు జిల్లా ఎస్పీ మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్, సిఎం భద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్ చెంప చెళ్లుమనిపించాడు.