ప్రాణం తీసిన అతివేగం

Card image cap


Published : 26/07/2021 05:24 IST
ప్రాణం తీసిన అతివేగం
కారు బోల్తాపడి హైదరాబాద్‌ యువతి మృతి
తమిళ నటి యాషికా ఆనంద్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు
మహాబలిపురం, న్యూస్‌టుడే: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ సినీ నటి, బిగ్‌బాస్‌ ఫేం యాషికా ఆనంద్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యాషికా ఆనంద్‌ స్నేహితురాలు హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాషికా ఆనంద్‌, హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ(28), మరో ఇద్దరు యువకులు శనివారం రాత్రి పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో బయలుదేరారు. మహాబలిపురం సమీపం సూళేరిక్కాడు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి.. బాధితులను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మహాబలిపురం పోలీసులు భవానీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భవానీ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
Tags :

Related Keywords

Puducherry , Pondicherry , India , Chennai , Tamil Nadu , United States , Nadu Mahabalipuram , , Tamil Nadu Mahabalipuram , Mahabalipuram Near , Peninsula United States , புதுச்சேரி , பொந்டிசேர்றிி , இந்தியா , சென்னை , தமிழ் நாடு , ஒன்றுபட்டது மாநிலங்களில் , நாடு மஹாபலிபுரம் ,

© 2024 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.