vimarsana.com


నా జీవితం ప్రమాదంలో పడింది...బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
హరిద్వార్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ పై అత్యాచారం కేసు నమోదైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘నా జీవితం ప్రమాదంలో పడింది, నేను ఈ విషయాన్ని ముందే చెప్పారు. ప్రజలు నాపై కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు బయట పెట్టాలని అప్పీలు చేస్తున్నా’’అని రాథోడ్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే రాథోడ్ పై శుక్రవారం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలపై జ్వాలాపూర్ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ పై తాము ఐపీసీ సెక్షన్ 376, 504,506, సీఆర్ పీసీ యాక్ట్ 156(3) à°² కింద కేసు నమోదు చేశామని హరిద్వార్ సీనియర్ పోలీసు అధికారి అబుదాజ్ కృష్ణరాజ్ చెప్పారు. 

Related Keywords

Suresh Rathore , ,சுரேஷ் ரதோரே ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.