మిన్నెపొలిస్: నలబై ఆరేళ్ల నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకేసులో మినెసొటా మాజీ పోలీస్ అధికారి డెరెక్ చావిన్‌ను దోషి అని గత ఏప్రిల్‌లోనే నిర్ధారించిన హెన్‌పిన్ కౌంటీ జిల్లా కోర్టు శుక్రవారం నాడు అతనికి 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తీర్పు వెలువడగానే కోర్టు వెలుపల ప్రజలు ఆనందోత్సాహాలతో చప్పట్లు చరిచారు.