న్యూఢిల్లీ: కొత్త మొబైల్ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టెలికం శాఖ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం కస్టమరు.. ఆన్‌లైన్‌లోనే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్ లేదా డిజిలాకర్‌లో భద్రపర్చిన ఇతరత్రా గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి వద్దే సిమ్ కార్డు పొందవచ్చు. కొత్త మొబైల్ కనెక్షన్ కోసం విశిష్ట గుర్తింపు