vimarsana.com


ఇరాక్‌లో బాంబు దాడి...ముగ్గురు సైనికుల మృతి
బాగ్దాద్ (ఇరాక్): ఇరాక్ దేశంలో రోడ్డు పక్కన జరిగిన బాంబు దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. ఇరాక్ దేశంలోని బానీసాద్ పట్టణ సమీపంలోని గ్రామం వద్ద ఉన్న సైనిక వాహనం వద్ద బాంబు పేలింది. ఈ బాంబు పేలుడులో ముగ్గురు సైనికులు మరణించారని బానీ సాద్ మేయర్ నజ్మా సాదీ చెప్పారు. ఈ పేలుడు జరిగినపుడు ఇరాక్ ఆర్మీ జవాన్లు ముగ్గురు సైనిక వాహనంలో ఉన్నారని వారు మరణించారని మేయర్ చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే ఇరాక్ భద్రతా బలగాలు సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చి దర్యాప్తు ప్రారంభించాయి.ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఇరాక్ సైనిక బలగాలను రంగంలోకి దించింది. 

Related Keywords

Iraq , ,Place Iraq Army ,Annapurna Marriages ,Islamic State ,இராக் ,இஸ்லாமிய நிலை ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.