తెలుగు కథకు తూర్పు దిక్కు ఉత్తరాంధ్ర కథ. తెలుగు కథకు పుట్టుకనే కాకుండా, మారుతున్న పరిణామ క్రమంలో, కొత్త మలుపులకు తీసుకు వెళ్లింది కూడా, ఉత్తరాంధ్ర కథే అంటే అతిశయోక్తి కాదేమో! వందేళ్లకు పైబడిన తెలుగు కథలో ప్రతి తరానికి దీపధారులు అయిన కథా రచయితలు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. అలాంటి ఉత్తరాంధ్ర కథ ప్రారంభ వికాసాలు పరిశీలిస్తే, సమాజంలో వచ్చిన ఉద్యమాలు, వాటి ఫలితంగా వచ్చిన వస్తువును బట్టి ఈ ప్రాంత కథను సంస్కరణ వాద ప్రభావం, అభ్యుదయ వాద ప్రభావం, గిరిజన రైతాంగ ఉద్యమ ప్రభావం, రైతాంగ ఉద్యమం అనంతర పరిస్థితుల ప్రభావం, ప్రపంచీకరణ ప్రభావం ..