సాక్షి, అమరావతి: టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులో ముందు వారికి సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు గురువారం తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులిచ్చారు. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్