కంప్యూటర్ సైన్స్ విద్య రంగంలో భారత్‌లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది.
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కార్యకలాపాలు పటిష్టంకావడానికి ఆ సంస్థ న్యాయ ప్రతినిధులు దేశంలో కేవలం రెండేళ్లలో రూ.8,646 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) న్యాయపరమైన వ్యయాలు (లీగల్ ఫీజులు) చేసినట్లు వచ్చిన వార్తా కథనాలు సంచలనం రేపుతున్నాయి.
ఆస్తులు అమ్ముకునేందుకు ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగించుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మరోసారి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీల్‌కు అనుమతి ఇవ్వండి ఫ్యూచర్, రిలయన్స్ గ్రూపుల మధ్య కుదిరిన రూ. 24,731 కోట్ల డీల్ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాల
రిలయన్స్‌తో కుదిరిన డీల్ విషయంలో ఫ్యూచర్ రిటైల్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ డీల్‌లో ముందుకెళ్లరాదంటూ సుప్రీం కోర్టు ఇటీవలే అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ మరోసారి సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టింది.