న్యూఢిల్లీ: దేశంలో ధనిక, పేదల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 10 శాతం పట్టణ వాసుల్లో సగటున ఒక్కో కుటుంబం వద్ద 1.5 కోట్ల మేర ఆస్తులు ఉండగా.. దిగువనున్న పేదల వద్ద రూ.2,000 (ఒక్కో కుటుంబం) మించి లేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన ‘ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే 2019’లో ఈ వివరాలు తెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి పట్టణాలతో