పెట్రో సె&#x

పెట్రో సెజ్‌పై చర్చలు.. నేడు ఢిల్లీకి మంత్రి మేకపాటి


పెట్రో సెజ్‌పై చర్చలు.. నేడు ఢిల్లీకి మంత్రి మేకపాటి
అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పెట్రోలియం శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులను ఆయన కలిసి కాకినాడ పెట్రో కెమికల్‌ సెజ్‌ విషయమై చర్చించనున్నారు. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ వ్యవహారం తేలితేనే గానీ ఈ సెజ్‌ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఈ సెజ్‌ గురించి గత ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ప్రస్తుత ప్రభుత్వం పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. కాకినాడ సమీపంలో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌), గ్యాస్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌) కలసి రూ.32వేల కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి ఈ రెండు కంపెనీలు సిద్ధంగానే ఉన్నా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. దాదాపు రూ.3వేల కోట్ల వరకూ ఫండింగ్‌ అసవరమని, అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామంటే పెట్రో సెజ్‌పై ముందడుగు పడుతుందని కేంద్రం చెబుతోంది. అయితే పునర్విభజన చట్టం ప్రకారం ఆ మొత్తం కూడా కేంద్రమే భరించాలని రాష్ట్రం కోరుతోంది. మరోవైపు ఈ ఫండింగ్‌ అంత భారీ మొత్తం లో ఉండదన్న వాదన తెరపైకి రావడంతో సుమారు రూ.2వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్‌పీసీఎల్‌-గెయిల్‌ తేల్చిచెప్పాయి. ఈ మొత్తం ఎవరు భరించాలన్న అంశంపైనే పెట్రో సెజ్‌ రాక ఆధారపడి ఉంటుందంటున్నారు. 

Related Keywords

Kakinada , Andhra Pradesh , India , New Delhi , Delhi , Amravati , Maharashtra , , New Delhi Minister , Department Minister , Kakinada Petro Issue , Prime Minister Modi , காக்கினாடா , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , புதியது டெல்ஹி , டெல்ஹி , அமராவதி , மகாராஷ்டிரா , புதியது டெல்ஹி அமைச்சர் , துறை அமைச்சர் , ப்ரைம் அமைச்சர் மோடி ,

© 2025 Vimarsana