రైల్వే ప్&#x

రైల్వే ప్లాట్ ఫాంపై రూ.లక్ష మరిచిపోయిన కూలీ.. తిరిగిచ్చిన కాన్స్‌టెబుల్


రైల్వే ప్లాట్ ఫాంపై రూ.లక్ష పోగొట్టుకున్న కూలీ.. తిరిగిచ్చిన కాన్స్‌టెబుల్
న్యూఢిల్లీ: ఓ ఢిల్లీ పోలీస్ తనలోని మానవత్వాన్ని, తన డ్యూటీలోని సిన్సియారిటీని నిరూపించుకున్నాడు. ఓ ప్రయాణికుడు మరచిపోయిన రూ.1లక్ష బ్యాగును తిరిగి అతడికి అందించాడు. వివరాల్లోకి వెళితే.. 53ఏళ్ల విజయ్ కుమార్ అనే కూలీ ఓ బ్యాగ్‌లో రూ.లక్ష పెట్టుకుని ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అయితే అనుకోకుండా ఆ బ్యాగ్ పోగొట్టుకుని వెళ్లిపోయాడు. ఆ బ్యాగ్ అక్కడి కానిస్టేబుల్ నరేందర్ కుమార్ కంట పడింది. నరేందర్ వెంటనే ఆ బ్యాగ్‌‌ను పూర్తిగా చెక్ చేశాడు. అందులో విజయ్ ఆధార్ కార్డు, ఇతర వస్తువులు దొరికాయి. వాటి ద్వారా విజయ్ అడ్రస్ తీయించాడు. అతడిని స్టేషన్‌కు పిలిపించి వెళ్లి ఆ సొమ్మును తిరిగిచ్చేశాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందపడిన విజయ్ కుమార్ ‘‘నేను ఈ డబ్బు తిరిగొస్తుందనే ఆశలన్నీ వదులుకున్నా. కానీ నరేందర్ బాబు నన్ను ఎన్నో కష్టాల నుంచి కాపాడిన దేవుడు’’ అంటూ కొనియాడాడు.

Related Keywords

Delhi , India , New Delhi , Narender Kumar , Vijay Aadhaar , Narender Babu , Vijay Kumar , Delhi Police , , Constable Narender Kumar , Vijay Address , டெல்ஹி , இந்தியா , புதியது டெல்ஹி , நரேந்தர் குமார் , விஜய் குமார் , டெல்ஹி போலீஸ் , கான்ஸ்டபிள் நரேந்தர் குமார் ,

© 2025 Vimarsana