డిస్పూర్: దేశవ్యాప్తంగా తన ప్రభావం కోల్పోతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత, అసోం మాజీ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతా బయోలో కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మహిళ నేత అని మార్చి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొదటి క్లూ ఇచ్చారు. సుస్మితా దేవ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు.