Jul 30, 2021, 12:50 IST విండోస్, ఆపిల్ కొత్త వెర్షన్ వినియోగదారులకు కేంద్రం హెచ‍్చరికులు జారీ చేసింది. పెగాసెస్‌తో సైబర్ అగ్గిరాజుకుంటే ఆగమేనని భావించిన కేంద్రం సైబర్ దాడులు జరిగే ఓఎస్‌లను గుర్తించి.. వాటి వినియోగంలో జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)విండోస్,ఆపిల్ ఐఫోన్,యాపిల్ ఐప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు ప్రైవేట్, ప్రభుత్వరంగానికి చెందిన సంబంధిత శాఖల రహస్యాల్ని సేకరించేందుకు టార్గెటెడ్ కంప్యూటర‍్లు, ల్యాప్‌ట్యాప్‌లను 'కోడ్ ఎగ్జిక్యూషన్' సాయంతో దాడి చేస్తారని,ఆ సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేసింది. విండోస్ వినియోగదారులు,యాపిల్ కొత్త వెర్షన్‌లను ఆపరేట్ చేసే వినియోగదారులు మితిమీరిన అనుమతుల కారణంగా యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్‌లో ఉన్న ఫైళ్లు,డేటా బేస్‌తో పాటు సెక్యూరిటీ అకౌంట్స్ మేనేజర్ (SAM) లు భద్రతలోపం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఆ లోపం కారణంగా పాస్‌వర్డ్ లను గుర్తించి సిస్టమ్ డ్రైవ్‌లను దొంగిలించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 వెర్షన్ 1809 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్, x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 1909 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్, x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 2004 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 20 హెచ్ 2 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 21H1 32-బిట్ సిస్టమ్స్, ARM64 -ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ సర్వర్ 2019 విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్) విండోస్ సర్వర్, వెర్షన్ 2004 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఆపిల్ సాఫ్ట్‌వేర్ ఆపిల్ మాకోస్ బిగ్ సుర్ వెర్షన్‌లు 1 ఆపిల్ iOS 14.7.1, ఐప్యాడ్ వెర్షన్లు ఐఫోన్ 6 తరువాత విడుదలై ఐఫోన్ 6వెర్షన్లు ఐప్యాడ్ ప్రో (డివైజెస్) ఐప్యాడ్ ఎయిర్ 2 తో పాటు వాటి వెర్షన్లు ఐప్యాడ్ 5 తో పాటు వాటి వెర్షన్లు ఐప్యాడ్ మినీ 4 తో పాటు వాటి వెర్షన్లు ఐపాడ్ టచ్ (7 వ తరం) మాక్ ఓస్ బిగ్ సుర్ వెర్షన్‌లను అప్ డేట్ చేయాలని కోరింది. ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide();