Updated : 27/06/2021 12:44 IST AP News: అత్తపై వేడి నూనె పోసిన కోడలు గుడ్లవల్లూరు: కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు ఇవ్వనందుకు అత్తపై కోడలు హత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే గుడివాడ పరిధి మందపాడులోని ఇంట్లో నిద్రిస్తున్న అత్త చుక్కా లక్ష్మిపై కోడలు స్వరూప వేడి నూనె పోసింది. ‘జగనన్న చేయూత’ డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో కోడలు ఈ దారుణానికి పాల్పడింది. తీవ్రగాయాల పాలైన అత్త లక్ష్మిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మందపాడులోని చుక్కా లక్ష్మి ఇంటి వద్ద గుడివాడ రెండో పట్టణ సీఐ దుర్గారావు విచారణ చేపట్టారు. ఆమె కోడలు స్వరూపతో పాటు కుమారుడు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవీ చదవండి