Jul 29, 2021, 12:19 IST రాంచీ : ఆటో ఢీకొన్న ఘటనలో జిల్లా జడ్జి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జార్ఖండ్, ధన్‌బాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధన్‌బాద్ జిల్లా అడిషినల్, సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం మేయిన్ రోడ్డుపై జాగింగ్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఐదు గంటల ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో వెనకాలనుంచి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన పక్కకు ఎగిరి పడ్డారు. రోడ్డు ప్రక్కన పడి ఉన్న ఆయనను గుర్తించిన కొందరు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారటమే కాకుండా.. పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆటోతో ఢీకొట్టి చంపినట్లు భావిస్తున్నారు. కాగా, మాజీ ఏఎస్‌జీ వికాస్‌సింగ్.. జడ్జి ఆనంద్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు ఆనంద్ మృతిపై సుమోటో కేసును స్వీకరించింది. ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } }); ఇవి కూడా చదవండి