హనుమ అంటేనే ఓ శక్తి. ఆ పేరే కొండంత ధైర్యం.
గంభీరమైన ఉగ్రతేజం.. అంతేస్థాయిలో మధుర వాక్కు, చిత్త సంస్కారం
అనుపమాన దేహదారుఢ్యం... అంతేలా సమున్నత బుద్ధిబలం
అపార శాస్త్ర పాండిత్యం.. అంతే తీక్షణ బ్రహ్మచర్య తేజం
గొప్పదైన ప్రతాపరౌద్రం.. అంతే స్థాయిలో పరమ శాంతచిత్తం...
వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు...
అనేక శక్తుల మేలుకలయికగా హనుమ దర్శనమిస్తాడు. భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం!
Related Keywords