ప్రధానాంశాలు సింగరేణి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభం రోజుకు 40 సిలిండర్ల సామర్థ్యం ఈనాడు, హైదరాబాద్: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి సోమవారం ప్రారంభమైంది. నిమిషానికి 200 లీటర్ల వంతున రోజుకు 40 సిలిండర్ల సామర్థ్యంతో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది. టర్కీ నుంచి విమానం ద్వారా ప్లాంటు విడిభాగాలను దిగుమతి చేసుకోవటంతో కేవలం 13 రోజుల్లోనే ప్లాంటును ప్రారంభించగలిగారు. ప్లాంటులో తయారైన ప్రాణవాయువును కంట్రోల్ సెంటర్ నుంచి పైపుల ద్వారా వార్డుల్లోని పేషెంట్లకు సరఫరా చేస్తారు. ఇదే తరహా ప్లాంట్లను భూపాలపల్లి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రులకు అనుబంధంగా మరో పది రోజుల్లో ప్రారంభించనున్నారు. ఒక్కో ప్లాంటు నిర్మాణం, రెండేళ్ల నిర్వహణకు రూ.35 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. రామగుండం ఏరియా ఆసుపత్రిలో గంటకు 45 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం కల ప్లాంటు, ఫిల్లింగ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జులై మొదటి వారంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. Tags :