కొత్తగా ల&#x

కొత్తగా లాంబ్డా కలకలం!


ప్రధానాంశాలు
Updated : 28/06/2021 06:55 IST
Corona: కొత్తగా లాంబ్డా కలకలం!
మరో రకం కరోనా.. 29 దేశాలకు వ్యాప్తి
 ‘దృష్టి సారించాల్సిన రకం’గా  ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
లండన్‌: కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం’ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)గా ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి. ఇది తొలుత గత ఏడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్‌ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్‌ కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32 శాతానికి పెరిగింది. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్‌ఈ పేర్కొంది. అయితే దీని స్పైక్‌ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీహెచ్‌ఈ తెలిపింది.
Tags :

Related Keywords

Argentina , Argentine Republic , , World Health Organization , New Lambda , Corona New , Corona , Enadu , National International , Newsarticle , Eneral , 702 , 21130899 , కర న , Covid 19 , క వ డ 19 , Corona Virus , కర న వ రస , Who , డబ ల య హ చ వ , Coronavirus India , Oronavirus Cases In India , Coronavirus Vaccine , Ockdown In India , Orona Cases , Ovid 19 Cases In India , Covid Vaccine , Nite2fightcorona , Ndiafightscovid19 , Ndiafightscoronatogether , Ndiafightsback , Argestvaccinedrive , Orona Vaccine Registration , Orona Vaccine Near Me , Orona Test Report , Orona Test Near Me , Oday Corona Cases In India , Oday Corona Cases In Ap , Oday Corona Cases In Telangana , Oronavirus Prevention , Orona Update , Elugu News , News Telugu , Ews In Telugu , Telugu Breaking News , Reaking Telugu In News , Atest Telugu News , Telugu Headlines , Oday Telugu News , Ndhra News In Telugu , Elangana News In Telugu , Telugu News Live , International News In Telugu , Nternational Telugu News , Orld News In Telugu , Orld Telugu News , Atest International News In Telugu , Oday World New In Telugu , Oday International News In Telugu , Op Stories , Elugu Top Stories , Coronavirus , Coronavirus News , Telugu News Paper , Oronavirus Latest Updates , Oronavirus News In Telugu , About Corona Virus In Telugu , Coronavirus Lakshanalu , Anathacurfew , Anatha Curfew , அர்ஜெண்டினா , ஆர்கெண்டைன் குடியரசு , உலகம் ஆரோக்கியம் ஆர்கநைஸேஶந் , தேசிய சர்வதேச , கொரோனா வைரஸ் , ஹூ , செய்தி தெலுங்கு , தெலுங்கு உடைத்தல் செய்தி , விட் ,

© 2025 Vimarsana