జమ్ములో మ&#x

జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం


జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం
సైనిక స్థావరంపై దాడికి యత్నం
జవాన్ల కాల్పులతో వెనుతిరిగిన రెండు క్వాడ్‌ కాప్టర్లు
జమ్ము: జమ్ములో డ్రోన్లతో మరో భారత సైనిక స్థావరంపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగింది. సైన్యం అప్రమత్తతతో అది భగ్నమైంది. ఆదివారం వాయుసేన వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగి 24 గంటలకు కాకముందే.. ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమైంది. 25 రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి. ఆ ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ‘‘రత్నచక్‌-కాలూచక్‌ ప్రాంతంలో రెండు డ్రోన్లను సైన్యం గుర్తించింది. వెంటనే సత్వర స్పందన దళాలు కాల్పులు జరపడంతో వెనక్కి మళ్లాయి. సైన్యం అప్రమత్తతతో భారీ ముప్పు తప్పింది’’ అని లెఫ్టినెంట్‌ కర్నల్‌ దేవేంద్ర ఆనంద్‌ తెలిపారు.
లష్కరే కీలక ఉగ్రవాది అరెస్టు
లష్కరే తోయిబా అగ్రశ్రేణి కమాండర్‌ నదీమ్‌ అబ్రార్‌ను సోమవారం జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీర్‌లో సైన్యం, పౌరులపై జరిగిన వివిధ దాడుల్లో అబ్రార్‌ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. ఎక్కడ.. ఎప్పుడు అరెస్టు చేశారన్న విషయాన్ని వెల్లడించలేదు. అబ్రార్‌ నుంచి ఓ పిస్టల్‌, గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది లవాయపొరాలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల హత్యలోనూ అబ్రార్‌ నిందితుడని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిరసన
జమ్ము వైమానిక స్థావరంపై దాడి, పుల్వామాలో పోలీసు అధికారి కుటుంబాన్ని హతమార్చిన ఘటనకు నిరసనగా శివసేన డోగ్రా ఫ్రంట్‌ కార్యకర్తలు సోమవారం ఆందోళన నిర్వహించారు. జమ్ములోని రాణి పార్క్‌ దగ్గర డోగ్రా ఫ్రంట్‌ కార్యకర్తలు.. పాకిస్థాన్‌ జెండాను కాల్చి.. ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్డీఎక్స్‌ వాడారా?
జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఆర్డీఎక్స్‌ పేలుడు పదార్థాలను వాడారా? అంటే ప్రాథమికంగా అవునన్న సమాధానం వస్తోంది. ఆదివారం వేకువ జామున రెండు డ్రోన్లు వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భవనంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనం పైకప్పునకు రంధ్రం పడింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న విచారణాధికారులు ఆర్డీఎక్స్‌ వాడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు.
Tags :

Related Keywords

Shiv , Rajasthan , India , Sena Dogra , Army It , Jair , Sunday Air Force , Let , Marchj Air , Shiv Sena Dogra , ஷிவ் , ராஜஸ்தான் , இந்தியா , இராணுவம் அது , ஜெயர் , விடுங்கள் , ஷிவ் சேனா டோக்ரா ,

© 2025 Vimarsana