Updated : 05/07/2021 07:36 IST జగన్‌కు ఆగస్టు సంక్షోభం తప్పదు: జడ్జి రామకృష్ణ రాజమహేంద్రవరం (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌కు ఆగస్టు సంక్షోభం తప్పదని జడ్జి ఎస్.రామకృష్ణ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయపరమైన అంశాలు బహిరంగపర్చడం సరికాదని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి వచ్చే నెల చీకటి రోజులు తప్పవని పేర్కొన్నారు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న కేసులో జగన్‌ను ముద్దాయిగా నిలబెట్టే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. త్వరలో తన స్వగ్రామం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట నుంచి రాజధానిలోని గవర్నరు బంగ్లా వరకు 650 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. దళితులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. జగన్ పథకాలకు దళితులు ఆకర్షితులవుతున్నారని, గతంలోని పథకాలకే పేర్లు మార్చి నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. Tags :