Corona: మరోసారి..4

Corona: మరోసారి..40 వేల దిగువకు కేసులు


Published : 05/07/2021 09:43 IST
Corona: మరోసారి..40 వేల దిగువకు కేసులు
కొత్తగా 39,796 మందికి కరోనా..723 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఆదివారం 39,796 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసులు క్రితంరోజు కంటే 7.6 శాతం క్షీణించడంతోపాటు మరోసారి 40 వేల దిగువకు పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో 723 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3,05,85,229కి చేరగా.. మృతుల సంఖ్య 4,02,728గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 15,22,504 మంది నమూనాలను పరీక్షించారు.
ఇక క్రియాశీల రేటు 1.58 శాతానికి తగ్గగా..రికవరీ రేటు 97.11 శాతానికి పెరిగింది. నిన్న 42,352 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.97కోట్లకు చేరాయి. ప్రస్తుతం 4,82,071 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క ఆదివారం 14,81,583 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 35,28,92,046కి చేరింది.
ఇవీ చదవండి

Related Keywords

Dilli , Delhi , India , , Mod Sunday , டில்லி , டெல்ஹி , இந்தியா ,

© 2025 Vimarsana