350 మీటర్ల లోతు నుంచి బొగ్గు ఉత్పత్తి శాంతిఖని గని రికార్డు బెల్లంపల్లి, న్యూస్‌టుడే: సింగరేణి బొగ్గు గనుల చరిత్రలోనే శాంతిఖని గని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా పరిధిలోని బెల్లంపల్లిలో ఉన్న శాంతిఖని గనిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో 350 మీటర్ల లోతు నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ఈ గని లోపలికి నేరుగా కార్మికులు, అధికారులు దిగడానికి 382 మీటర్ల లోతైన మ్యాన్‌వైండింగ్ షాప్టును నిర్మించారు. సిబ్బంది లోపలికి వెళ్లడానికి ఇనుప తాళ్ల సహాయంతో పనిచేసే భారీ కేజీలను ఉపయోగిస్తున్నారు. గనిలో దాదాపు 50 మిలియన్ టన్నులను మించి బొగ్గు నిక్షేపాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గని జీవిత కాలం 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా. Tags :