ప్రధానాంశాలు వారు నాటుతున్నారు..వీరు కొట్టేస్తున్నారు! పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం గత ఏడేళ్లుగా ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. పలు చోట్ల అవి పెరిగి పెద్దవైౖ విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు కల్పిస్తుండడంతో విద్యుత్తు అధికారులు కొన్ని చోట్ల చెట్లను పూర్తిగా కొట్టేస్తుండగా మరి కొన్ని చోట్ల కొమ్మలు నరికివేస్తున్నారు. పైన కనిపిస్తున్న చిత్రాలు ఇలాంటివే. నిజామాబాద్‌లోని మహిళా కళాశాల రహదారిలో ఐదేళ్ల కిందట నాటిన మొక్కలు పెరిగి నేడు విద్యుత్తు తీగలను తాకుతున్నాయి. దీంతో కరెంటు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కొన్ని చెట్ల కొమ్మలను కొట్టేశారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన ఏడో విడత హరితహారంలో భాగంగా ఆర్మూర్- నిజామాబాద్ రహదారిలో విద్యుత్తు తీగల కిందే మొక్కలను నాటారు. ప్రభుత్వ ఆశయం నీరుగారకుండా అధికారులు ముందుచూపుతో విద్యుత్తు తీగలకు దూరంగా కానీ, ఒక వేళ అక్కడే నాటాలనుకుంటే ఆరడుగులు మించి ఎత్తు పెరగని మొక్కలను కానీ నాటితే ప్రయోజనకరమని పర్యావరణ హితులు అభిలషిస్తున్నారు. -ఈనాడు, నిజామాబాద్ Tags :