ప్రశ్నిం

ప్రశ్నించేవారంటే సీఎంకు నచ్చదు


ప్రధానాంశాలు
ప్రశ్నించేవారంటే సీఎంకు నచ్చదు
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌
జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: తనను ప్రశ్నించేవాడు తెలంగాణ గడ్డమీద ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారని, ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా దీవెన పాదయాత్రలో భాగంగా గురువారం ఇల్లందకుంట మండలంలోని గ్రామాల్లో వర్షంలో పర్యటించారు.ఉద్యమంలో కొట్లాడిన వాళ్లంతా బజార్లో పడ్డారని, ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన వారు, కేసీఆర్‌ పక్కన ఉన్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే పది లక్షలు ఇస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బరితెగించి చెబుతున్నారన్నారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కాంగ్రెస్‌ వాళ్లకి డబ్బులు ఇచ్చింది వాస్తవం కాకపోతే ముక్కు నేలకు రాస్తా...వాస్తవమైతే నువ్వు రాస్తావా సీఎంకు సవాల్‌ విసిరారు. జమ్మికుంట బిజిగిరిషరీఫ్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈటల జమున, భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభ, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉమ, భాజపా నాయకులు చుక్క రంజిత్‌కుమార్‌, శ్రీనివాస్‌, పాల్గొన్నారు.
Tags :

Related Keywords

, President Krishna , ப்ரெஸிடெஂட் கிருஷ்ணா ,

© 2025 Vimarsana