పోటీ పరీక్షల లక్షణాల్ని అవగాహన చేసుకోవటం, సిలబస్‌పై పట్టు, ప్రశ్నపత్రాలను లోతుగా పరిశీలించటం అనే మూడు అంచెలు చూశాం. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో నాలుగో సోపానం ‘సరైన పుస్తకాల ఎంపిక’. సిలబస్‌లోని వివిధ అంశాలను పరీక్ష, ప్రశ్నలు, స్కోరింగ్ కోణంలో ఎదుర్కొనే సమగ్ర సమాచారాన్ని పొందేందుకు మంచి పుస్తకాలు ఉపయోగపడతాయి. అందువల్ల సరైన పుస్తకాల ఎంపిక సగం విజయం ఏ పుస్తకాలు.. ఎంత మేలు?