ముంచంగిపుట్టు : మంగళవారం నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎస్‌ఐ ఆర్.సంతోష్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. బాంబు స్క్వాడ్ కల్వర్టులను తనిఖీ చేసింది. వాహనదారులను క్షణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే విడిచిపెట్టారు. ఎఒబి సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ ప్రాంతాల్లో ఒడిశా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. కుమడ, జోలాపుట్ సరిహద్దు, కుజబంగి ప్రాంతాలు పోలీసు బలగాల నిఘాలో ఉన్నాయి.