సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నా. డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి. ఆపదలో ఉన్నా సాయం చేయండంటూ టోలీచౌక్‌కు చెందిన సిద్దిఖీకి బాగా తెలిసిన వారి నుంచి ఇటీవల వాట్సప్ ద్వారా మెసేజ్ వచ్చింది. నిజమేనని నమ్మిన సిద్దిఖీ క్షణం ఆలోచించకుండా రూ.3లక్షలు ఎకౌంట్‌కు బదిలీ చేసింది. మరుసటి రోజు ఆస్పత్రిలో పరిస్థితి ఎలా ఉందో కనుక్కునేందుకు ఫోన్ చేయగా..