న్యూఢిల్లీ: మతచాంధస, ఉగ్రమూలాలున్న తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ ‘రాజకీయ’ స్వరూపం మారుతోందని, దీంతో దేశ భద్రతా సవాళ్లు మరింత సంక్షిష్టమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. సవాళ్లకు ధీటుగా నిలబడాలంటే సొంత రక్షణ రంగ వ్యవస్థను మరింత పటిష్టంచేయాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. రక్షణరంగంలో వినూత్న ఆవిష్కరణలకు