Literature: MS Raju And Naganjaneyulu Poetry In Sakshi Sahit

Literature: MS Raju And Naganjaneyulu Poetry In Sakshi Sahityam


వేగంగా వచ్చి గాలి 
నిదురోతున్న కళ్ళను తట్టిలేపింది. 
వెన్నెల కురుస్తున్న రేయి కిటికీలోంచి 
అద్భుత చిత్రంలా కనిపిస్తోంది. 
ఆకాశం
చందమామను
నింగిలో ...
పున్నమి చంద్రుడి
ద్విపాత్రాభినయం. 
పంట కాపరి గొంతులోంచి 
వెన్నెల పాటను వినిపించడానికి 
గాలి
ఒడ్డున సేదతీరిన నావ!
జాబిలమ్మ 
జాగరణ చేస్తోంది. 
పున్నమి రేయిని గుర్తెట్టుకుని 
వీధి దీపం 
చెరువులో కలువ... 
వెన్నెలతో కబుర్లు ... 
చెవులు మూసుకున్నాయి
చేపలు. 
నిలువెత్తు గట్టు...
వెన్నెల వెలుగులో
వేకువ దాకా... 
మాట్లాడుకున్నాయి.
చందమామ కథలు వింటూ... 
అమ్మ ఒడిలో ఒదిగిన       
చంటి పిల్లాడ్ని 
అసూయగా చూస్తూ... 
ఆకాశంలో... రేయంతామేల్కొన్నాడు 
పున్నమి చంద్రుడు.
-ఎ.నాగాంజనేయులు  
మేలిమి పద్యం
► హృదయ మది మహోదయమై,
ఉదయ మది నవోజ్జ్వలమయి, యుర్వి వెలింగెన్‌
హృదయమిది మరణ జయమై,
ఉదయమిది బహూదయమయి, యుర్విన్నిలుచున్‌!
(కొలకలూరి ‘ఉజ్జీవజ్యోతి’ ఖండిక నుంచి)
► అధరసీధు వేదొ ఆసవం బేదొ యె
రుంగ లేడు గాదె, దొంగవోలె
ఏల చొచ్చె పానశాల, గులాబీల
పాల కంటకమ్ము వోలె వడు?
(దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఉమర్‌ ఖయామ్‌’ నాటిక నుంచి)
► భూస్వామ్య ధనస్వామ్య బ
లస్వామ్యములేను గాక రహిలో గల ఏ
ఏస్వామ్యమైన బెదరు భ
యస్వామ్యము కుట్ర పన్నె హతమార్చగ నిన్‌
(జె.బాపురెడ్డి ‘హృదయపద్యం’ నుంచి)
► చదువు సందె వద్దు శాస్త్రపాండితి వద్దు
మంచిచెడ్డ లరయ మనసు వద్దు
గద్దె ఒకటి చాలు ఘనుడనిపించగా
కంటి నలుసుర పులికంటి మాట
(పులికంటి కృష్ణారెడ్డి ‘ఆటవెలదుల తోట’ నుంచి)
' ).trigger('newElementAdded');
setTimeout(function() {
googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); });
}, 500);
$("body").on("newElementAdded", "#image_bd_ad", function() {
}(jQuery));
}
});
');
}
x = 2;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('#loadMore').click(function () {
/*
$(".field-name-body .field-item p").each(function(){
if ($.trim($(this).text()) == ""){
size_p = $(this).remove();
}
});
*/
x = size_p;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('.mr_btm').hide();
});
}
});

Related Keywords

Devulapalli Krishnasastri , , Lit New , Vigil Setting ,

© 2025 Vimarsana