- బిజెపి హర్యానా అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలపై ఎస్‌కెఎం ఆగ్రహం - 22 నుంచి కబడ్డీ పోటీలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు ఉద్యమ బలోపేతానికి దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర లోని నందుర్‌బార్‌లోని బిసర్‌బాడిలో షెట్కారి సంవాద యాత్ర గురువారం ప్రారంభమైంది. అంతకుముందు ఖండ్‌బరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.