బెంగళూరు : కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం కోసం తక్కువ ధరకే 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేవనహల్లి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో 100 ఎకరాలు చాణక్య అనే పేరుతో నిర్మించే ప్రైవేటు యూనివర్సిటీకి కేవలం రూ 50 కోట్లకు కేటాయించింది. పైగా యూనివర్శిటీలో సభ్యులంతా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు. ఈ ప్రతిపాదిత యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉన్న కె శ్రీథర్ ఆర్‌ఎస్‌ఎస్‌కు వీరాభిమాని.