కేసీఆర్, క&#

కేసీఆర్, కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ దుమారం రేపే వ్యాఖ్యలు


కేసీఆర్, కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ దుమారం రేపే వ్యాఖ్యలు
కేసీఆర్‌కు ఓటమి భయం
కేటీఆర్ ఈ జన్మలో సీఎం కాలేరు
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
కరీంనగర్ జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేక మేడ లాగా కూలిపోతుందని ఎంపీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన.. మంత్రి కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని కూడా వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌ను నిలబెట్టు..!
‘భైంసా పట్టణంలో ఒక్క హిందువునూ ఉంచడం లేదు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకు ఈటల రాజేందర్‌పై కుట్ర చేశారు. కేసీఆర్‌కు సిగ్గు, శరం, దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్‌ను తీసుకొచ్చి ఇక్కడ (హుజురాబాద్) నిలబెట్టాలి. పైసలు తీసుకున్న టీఆర్ఎస్ నాయకులు ఈటలకు టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓ బెవకూఫ్. హుజురాబాద్ ఎన్నిక కోసం కేసీఆర్ మూడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కర్మ కాలి టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే అధికారులు బానిసలు అవుతారు. దళితులను కేసీఆర్ అవమానించినంతగా ఇంకా ఎవరూ అవమానించలేదు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు ముఖ్య మంత్రులు ఉన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటుండు. తెలంగాణలో ఫ్యాక్టరీలు ఎందుకు అమ్ముతున్నవు..?’ అని కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో అరవింద్ విమర్శలు గుప్పించారు.

Related Keywords

Telangana , Andhra Pradesh , India , Huzurabad , Vizag , Karimnagar , Dharmapuri Arvind , , Karimnagar District , தெலுங்கானா , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , ஹுசுராபாத் , விசாக் , கரிம்நகர் , தர்மபுரி அரவிந்த் , கரிம்நகர் மாவட்டம் ,

© 2025 Vimarsana