దాస‌రి త‌&

దాస‌రి త‌ర్వాత చిరంజీవిగారే పెద్ద దిక్కుగా మారారు: ముర‌ళీ మోహ‌న్‌


దాస‌రి త‌ర్వాత చిరంజీవిగారే పెద్ద దిక్కుగా మారారు: ముర‌ళీ మోహ‌న్‌
సీనియ‌ర్ న‌టుడు, మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు ముర‌ళీ మోహ‌న్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఇండ‌స్ట్రీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇదే సంద‌ర్భంలో ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించిన దాస‌రి గురించి మాట్లాడుతూ, ఆయ‌న త‌ర్వాత ఆ బాధ్య‌త‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నార‌ని తెలిపారు. ‘‘దాస‌రిగారు నాకు ప్ర‌తిరోజూ గుర్తుకు వ‌స్తారు. మ‌హానుభావుడు.. ఎంతో మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు లిఫ్ట్ ఇచ్చి అన్నం పెట్టాడు. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా దాన్ని సెటిల్ చేసేవాడు. ఈరోజున దాస‌రిగారు, రామానాయుడుగారు, à°¡à°¿.వి.ఎస్‌.రాజుగారు వంటివారు లేరు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ఎవ‌రి ద‌గ్గ‌రికెళ్లి చెప్పాల‌ని అంద‌రికీ అనిపించేది. ఓరోజు చిరంజీవిగారితో మాట్లాడేట‌ప్పుడు ‘ఇండ‌స్ట్రీలో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే పెద్దాయ‌న ద‌గ్గ‌ర‌కెళ్లి కూర్చుని మాట్లాడుకుందాం అనుకునే పెద్దాయ‌న లేరు. మీరొక సీనియ‌ర్ హీరో. రాజ‌కీయంగా మంత్రి, పార్లమెంట్ స‌భ్యుడిగా ప‌నిచేశారు కాబ‌ట్టి మీరు ఆ బాధ్య‌త తీసుకుంటే బావుంటుంది’ అన్నాను. దానికి ఆయ‌న ‘నేను చేయ‌గ‌ల‌నా.. లేనా?’ అన్నారు కానీ.. ఆ బాధ్య‌త‌ను చిరంజీవిగారు తీసుకున్నారు’’ అని ఇంటర్వ్యూలో మురళీ మోహన్ అన్నారు. 

Related Keywords

Murali Mohan , Chiranjeevi , , முரளி மோகன் , சிரஞ்சீவி ,

© 2025 Vimarsana