చిరంజీవి

చిరంజీవితో న‌వాజుద్దీన్‌.. ఏ సినిమాలో తెలుసా!


చిరంజీవితో న‌వాజుద్దీన్‌.. ఏ సినిమాలో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వెర్సైట్ బాలీవుడ్ యాక్ట‌ర్ న‌వాజుద్దీన్ సిద్ధిఖీ న‌టించ‌నున్నారంటూ సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి, బాబీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం న‌వాజుద్దీన్ సిద్ధిఖీని న‌టింప చేయాల‌ని మేక‌ర్స్ భావించి ఆయ‌న్ని సంప్ర‌దించ‌గా ఆయ‌న కూడా ఆస‌క్తికిని క‌న‌ప‌ప‌రిచారు. నెరేష‌న్ ఇవ్వాల‌ని కోరారు. న‌వాజుద్దీన్ వంటి న‌టుడు సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూప‌డ‌మ‌నేది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మ‌రింత ఎన‌ర్జీని ఇచ్చింది.  
త్వ‌ర‌లోనే న‌వాజుద్దీన్‌కి నెరేష‌న్ ఇవ్వ‌డానికి డైరెక్ట‌ర్ బాబీ ముంబై వెళ్ల‌బోతున్నార‌ట‌. వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టుకుని ఎదురుచూస్తున్న చిరంజీవి కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితులు కాస్త మెరుగుప‌డిందో లేదో ఆచార్య సినిమాను ట్రాక్ ఎక్కిస్తున్నారు. దీని త‌ర్వాత లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించాల్సి ఉంది. దీని త‌ర్వాతే బాబీ సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలోనో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 

Related Keywords

Bollywood Siddique , Chiranjeevi , , சிரஞ்சீவி ,

© 2025 Vimarsana