ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ''వ్యవసాయాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి' నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన రాజ్‌భవన్ల ముట్టడి పూర్తిగా విజయవంతమైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ వేలాది మంది రైతులు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమానికి అన్ని సెక్షన్ల నుంచి అన్ని స్థాయిల్లో మద్దతు లభించింది. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీల నుద్దేశించి రైతు నేతలు మాట్లాడుతూ, కేంద్రం కాంట్రాక్టు వ్యవసాయాన్ని దేశంపై రుద్ది ఆహార భద్రతకు చేటు తెస్తుందన్నారు.