ప్రాణవాయ

ప్రాణవాయువు త్వరలోనే ప్రారంభం కానుంది: సోనూసూద్‌


ప్రాణవాయువు త్వరలోనే ప్రారంభం కానుంది: సోనూసూద్‌
కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఆక్సిజన్‌ అందక చాలా మంది ప్రాణాలు విడిచారు. సామాన్యులు పడే ఇబ్బందులను గమనించిన రియల్‌ హీరో సోనూసూద్‌ తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసిన సంగతి విదితమే. ఆంధ్ర ప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పిన సోనూసూద్‌ అన్నమాట ప్రకారమే విదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను తెప్పించారు. త్వరలోనే నెల్లూరులో ఈ ప్లాంటు ప్రారంభం కాబోతున్నట్లు ఆయన తెలిపారు. "ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ప్రాణ వాయువు త్వరలో ప్రారంభం కానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్‌స్టాల్ చెయ్యబోతున్నాను" అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. 

Related Keywords

Andhra Pradesh Kurnool , , Hero Telugu States , Plant Nellore , Telugu States , ஆந்திரா பிரதேஷ் கர்னூல் , தெலுங்கு மாநிலங்களில் ,

© 2025 Vimarsana