మైసూరు: ప్రశాంత మైసూరు నగరంలో నగల షాపులో దోపిడీదొంగలు లూటీ చేసి ఒకరిని కాల్చిచంపిన సంఘటన జరిగి మూడురోజులు కాక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి కొంచెం దూరంలో ఒక యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చాముండికొండ దగ్గర లలితాద్రిపుర సమీపంలో ఈ దారుణం జరిగింది. మైసూరు వర్సిటీలో పరిశోధక