ప్రజాధనం

ప్రజాధనంతో ఓట్ల గాలం!


ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో విచిత్రమైన పరిస్థితి..!
ప్రజాధనంతో ఓట్ల గాలం!
సర్కారు సొమ్ముతో ఓట్ల వేట
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ‘దళిత బంధు’ను వాడుకుంటామని స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్‌
దళితేతర వర్గాల్లో అసంతృప్తి
మిగిలిన నియోజకవర్గాల ప్రజలు నారాజ్‌
అధికార టీఆర్‌ఎస్‌లోనే చర్చ
మా ఎమ్మెల్యే చనిపోతే లేదా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది
మాకు మేలు జరుగుతుంది
సోషల్‌ మీడియాలో పోస్టులు
హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ‘దళిత బంధు’ పథకం కింద ఎన్నికలు జరగనున్న ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రూ.2,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార, విపక్షాలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే, పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తారు. కానీ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో షెడ్యూల్‌ వెలువడక ముందే ఏకంగా ప్రభుత్వం అక్కడ ఓటర్లను సూటిగా ప్రభావితం చేసేందుకే అన్నట్లుగా ‘దళిత బంధు’ పైలట్‌ ప్రాజెక్టు అమలుకు పూనుకోవటం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ పేరుతో ఒక పథకాన్ని తాజా వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ పథకం అమలు కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అనుకోకుండా హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావటంతో ఈ పథకం స్వరూప, స్వభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలి విడతలో ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద మంది వంతున ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఈ పథకం అమలు కోసం ఇతరత్రా ఖర్చులు కాకుండా రూ.1,190 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. హఠాత్తుగా హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. అక్కడ సంతృప్త స్థాయిలో పథకం అమలు కోసం అదనంగా రూ.1,500 నుంచి రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. దీంతో ‘దళిత బంధు’ పథకం రాష్ట్ర వ్యాప్త అమలు కోసం వెచ్చిస్తామని చెప్పిన బడ్జెట్‌ కంటే ఎక్కువ నిధులను ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే ఖర్చు చేస్తారని స్పష్టమైంది. 
మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి?
‘దళిత బంధు’పై ఒకపక్క విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మరోపక్క సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో ఓటర్లను ఆకర్షిస్తే తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో, ఆ తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కొందరు దళిత నేతలు ఇది ఎన్నికల తాయిలమేనని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హుజూరాబాద్‌ స్థాయిలో దళిత బంధు కోసం ఖర్చు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం ‘దళిత బంధు’ పాచిక విసురుతున్నారు సరే! అదే నియోజకవర్గంలోని దళితేర వర్గాలు, మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి?’’ అనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. ‘‘హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దళితులు మాత్రమే లేరు. మిగిలిన వర్గాల ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఎలా సమాధానపరుస్తారు?’’ అనే సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. 
అంతేకాక ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సంతృప్త స్థాయి పేరిట దళితుందరికీ ‘బంధు’ను అమలు చేసి, మిగిలిన 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన ఇతర దళితుల నుంచి తమకు నిలదీతలు తప్పవని మెజార్టీ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అన్నింటి కంటే మించి సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఫోక్‌సగా తీసుకొస్తున్న ‘దళిత బంధు’ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితేర వర్గాల నుంచి వ్యతిరేకత తప్పకపోవచ్చని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎన్నింటినో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనే సరికి కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతీ కుటుంబం ఆశ పడుతుందనే అభిప్రాయాన్ని చాలామంది టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో.. ‘మా ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండు..లేకపోతే రాజీనామా అయినా చేయాలి.. అప్పుడే ఉప ఎన్నిక వస్తుంది.. మాకు, మా నియోజకవర్గానికి నిధులు వస్తాయి. మేలు జరుగుతుంది. కొత్త పథకాలు అమలు చేస్తారు’ అనే పోస్టులు వైరల్‌ అవుతుండటాన్ని à°

Related Keywords

, Residential School , Assembly Place Sub , Assembly Place , Chief Minister Dalit , Run Act , Assembly Advanced , District Village , Nalgonda District , குடியிருப்பு பள்ளி , சட்டசபை இடம் , ஓடு நாடகம் , மாவட்டம் கிராமம் , நல்கொண்டா மாவட்டம் ,

© 2025 Vimarsana