వ్యాక్సిన్ వేయించుకోకపోవడం కూడా హీరోయిజంగా భావించిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారోకు చేదు అనుభవం ఎదురైంది. 'మీకు ఇక్కడ ప్రవేశం లేదు' అని ముఖం మీద కొట్టినట్లు న్యూయార్క్‌లోని రెస్టారెంట్ యజమానులు చెప్పడంతో ఆయన వీధిలో పిజ్జాలు తినాల్సివచ్చింది. జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడికి సోమవారం రాత్రి ఎదురైన అనుభవం ఇది. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేనిదే నగరంలోని రెస్టారెంట్లలోకి రావడానికి ఆయనను అనుమతించలేదు.