Live Breaking News & Updates on 21128809

Stay informed with the latest breaking news from 21128809 on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in 21128809 and stay connected to the pulse of your community

లాక్‌డౌన్‌ ప్రేమలు వేరయా..!


లాక్‌డౌన్‌ ప్రేమలు వేరయా..!
అంతరంగం
ఒకర్నొకరు కలుసుకోవడాలు లేవు.. మనసు విప్పి మాట్లాడుకుంది లేదు. లాక్‌డౌన్‌తో కుర్ర ప్రేమికులు నిన్నటిదాకా పడిన పాట్లు ఎన్నో. ఈ సమయంలో మీ ఫీలింగ్స్‌ ఏంటి? అంటూ ప్రముఖ డేటింగ్‌ యాప్‌ పెద్దఎత్తున సర్వే చేసింది. మీ లైఫ్‌స్టైల్‌ ఎలా మారిపోయింది? అంటూ అడిగింది. మన మిలీనియల్స్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలివి.
* చేతిలో చేయి వేసుకొని, కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కబుర్లు చెప్పుకుంటేనే కాదు.. ఎంతో దూరంలో ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకునేదే నిజమైన ప్రేమ అని 91శాతం యువత సెలవిచ్చారు.
* వలచిన చెలికాడు, మనసుకి నచ్చిన నెచ్చెలిని కలుసుకోవాలని ఉబలాటంగా ఉన్నా.. 58 శాతం మంది పరిస్థితులన్నీ సానుకూలంగా మారిన తర్వాత ఆ పని చేస్తామని చెప్పారు.
* ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ లేదా డేటింగ్‌ యాప్‌లతో మనసుకి నచ్చినవాళ్లు దొరికేశారని 38 శాతం మిలీనియల్స్‌ నొక్కి వక్కాణించారు.
* ఇప్పటికిప్పుడు లవర్‌ని కలుసుకునే అవకాశం వస్తే ఏం చేస్తారని అడిగితే.. 41శాతం డిన్నర్‌ చేస్తామనీ, 22శాతం మంది సినిమాకు వెళ్తామని మనసులో మాట వెల్లడించారు.
* మానసికంగా ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత డేటింగ్‌, రొమాన్స్‌ ముచ్చట్లంటూ 85శాతం పడుచు ప్రాయులు ముసిముసిగా నవ్వారు.
* ఎంత దూరంలో ఉన్నా ఫోన్లు, వీడియో చాటింగ్‌లతో మేం చేరువ అవుతామన్నది ఈ ఆధునిక ప్రేమికుల మాట.
* వర్చువల్‌ ప్రేమలో మునిగి తేలడమే కాదు.. ఈ లాక్‌డౌన్‌లో పాకశాస్త్రంలో పాఠాలు నేర్చుకున్నామని 42శాతం అమ్మాయిలు, 39శాతం అబ్బాయిలు గర్వంగా చెప్పారు.
Tags :

ల-క-డ-న- , Enadu , Etharam , Rticle , Eneral , 102 , 21128809 , Ockdown , Love , Story , Inner-view