Live Breaking News & Updates on ఆమ

Stay informed with the latest breaking news from ఆమ on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in ఆమ and stay connected to the pulse of your community

ఆగిన చదువుకు ఆమె సాయం!


ఆగిన చదువుకు ఆమె సాయం!
హైదరాబాద్‌లో ఉండే స్వరూప దంపతులు రాళ్లుకొట్టే పని చేసుకొని  బతుకుతున్నారు... చదివించే స్థోమత లేక పదో తరగతి తర్వాత కొడుకుని తమతో కూలిపనికి తీసుకెళ్లాలనుకున్నారు... బాగా చదివే ఆ కుర్రాడు కూలీపనికి వెళ్లడం అతని క్లాస్‌ టీచర్‌కి నచ్చలేదు. అందుకే ఆ పేద దంపతులని సెవెన్‌ రేస్‌ ఫౌండేషన్‌ని నిర్వహించే సారా దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చిందామె. ఇప్పుడా కుర్రాడు  శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ బైపీసీ చదువుతున్నాడు.....
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన సారా ఐటీ ఉద్యోగిని. ఉద్యోగంతో పాటూ... ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తున్నారామె. మొదట్లో చిన్నగా ప్రారంభించి... తర్వాత నగరమంతటా తన సేవల్ని విస్తరించింది.  ప్రధానంగా హైదరాబాద్‌లోని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉండే వారి అవసరాలపై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు ఇల్లిల్లూ తిరిగిన సారాను ఎక్కువగా కలిచివేసిన విషయం పేదపిల్లల చదువు. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతోమంది తల్లిదండ్రులకి పిల్లల చదువులు భారమయ్యాయి. దాంతో చాలామంది పిల్లలు చదువుకి మధ్యలోనే దూరమవడం స్వయంగా చూసింది సారా. అలాంటి పిల్లల బాధ్యతని తాను తీసుకుని వాళ్లని మంచి కాలేజీల్లో చదివించాలనుకుంది. అలా సుమారు పాతికమంది పిల్లలకు ఆర్థిక సాయం అందించి... వాళ్లని నారాయణ, శ్రీచైతన్య, గీతం, వెస్లీ వంటి కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్పించి వాళ్ల ఫీజులని తనే కడుతోంది. అందులో చాలామంది ఇళ్లలో పనిచేసుకుని పొట్టపోసుకునే వాళ్ల పిల్లలే. సారా చేసిన ఆర్థిక సాయం వల్ల ఈ రోజు వారంతా ఇంజినీరింగ్‌, ఫార్మా వంటి ఉన్నత కోర్సులు చదువుతున్నారు. ‘చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలని గొప్ప చదువులు చదివించాలని... మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే చూడాలనే కోరిక బలంగానే ఉంది. కానీ కూలీనాలీ చేసుకునేవారికి ఇదేం చిన్న భారం కాదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, డ్రాపవుట్లు, తండాల్లో ఉండే చిన్నారులు, ఒంటరి తల్లుల దగ్గర పెరుగుతున్న పిల్లలకు అండగా ఉండాలని అనుకున్నా. కేవలం కార్పొరేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి ఊరుకోవడం కాకుండా... వాళ్లలో ఆసక్తి ఉండి  పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునేవారికి సైతం ఫీజులు చెల్లించాలనుకుంటున్నా. దాతలు, సామాజిక మాధ్యమాలు, ప్రముఖుల సహకారంతో ఈ యజ్ఞం నిర్విరామంగా సాగుతోంది’ అనే సారా తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రెండు తండాలను దత్తత తీసుకొని అక్కడి పిల్లల చదువు, మహిళల ఉపాధి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.
-పత్తిపాక ప్రవీణ్‌కుమార్‌, ఈటీవీ
Tags :

ఆగ-న , చద-వ-క , ఆమ , స-య , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121051785 , Seven-rays-foundation

ఆమె నొసటన అరుణ తిలకం!


ఆమె నొసటన అరుణ తిలకం!
కాలిఫోర్నియాలోని నాసా మిషన్‌ కంట్రోల్‌రూమ్‌ అది... భరించరాని ఉత్కంఠ అందరిలోనూ!  గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను తాకింది’ అని ఆమె  ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న శాస్త్రవేత్తల్లో  పట్టరాని సంతోషాన్ని నింపాయి. ఆమె మాటలే కాదు... ఆమె నుదుటన భారతీయతను ప్రతిబింబించేలా ఉన్న గుండ్రని బొట్టు కూడా ఈ రోజు ప్రపంచాన్ని ఆకర్షించింది.. అంగారక గ్రహంపైకి చేరిన పర్సీవరెన్స్‌ రోవర్‌కి ల్యాండింగ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న స్వాతీమోహన్‌ సాధించిన విజయం ఏంటో తెలుసుకుందాం..
ఏడాది పసిపిల్లగా ఉన్నప్పుడు స్వాతి ఈ   దేశాన్ని వదిలి కుటుంబంతో సహా అమెరికాలో అడుగుపెట్టింది. వెళ్తూవెళ్తూ ఆ కుటుంబం ఈ దేశం కట్టూబొట్టుని, సంస్కృతిని తీసుకెళ్లడం మర్చిపోలేదు. బెంగళూరులో పుట్టిన స్వాతి... పెరిగిందంతా నార్తర్న్‌ వర్జీనియాలోనే. చిన్నప్పటి నుంచి పిల్లల డాక్టరు కావాలని కలలుకందామె. కానీ తొమ్మిదేళ్లప్పుడు ఆమె చూసిన ‘స్టార్‌ ట్రెక్‌’ సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిసోడ్‌లు తనని ఎంతగా ప్రభావితం చేశాయంటే కొత్త కెరీర్‌వైపు ఆమె దృష్టిని మళ్లించాయి. విశ్వంలో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే తన లక్ష్యంగా మార్చుకుంది స్వాతి.
పదహారేళ్ల వరకూ ‘అమ్మో సైన్సా’ అని భయపడిన స్వాతి మొదటి సారి ఫిజిక్స్‌ క్లాసు విన్న తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది. కారణం తన సైన్స్‌ టీచర్‌. ఆ టీచర్‌ ఆమెలో భయాన్ని తరిమేశారు. ఇక అక్కడ నుంచి ఆమె శాస్త్రవేత్త అవ్వాలనే తన ఆలోచన సరైనదేనా అని ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఎమ్‌ఐటీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీహెచ్‌డీని పూర్తిచేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్న జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.
అందమైన అరుణగ్రహం... శాస్త్రవేత్తలకు ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంది. తనలోని మార్మికతను వెతకమన్నట్టుగా పరిశోధకులకు ఆహ్వానం పలుకుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం మొదలైంది నాసా ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక మార్స్‌ 2020 ప్రాజెక్టు. అంతకు ముందు శనిగ్రహంపైకి పంపిన కెశీని.. చందమామపైకి పంపిన గ్రెయిల్‌ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర వహించి తనని తాను నిరూపించుకున్న స్వాతికి ఈ ప్రాజెక్టుల్లో మరిన్ని బాధ్యతలని అప్పగించింది నాసా.
ఆ సంస్థ పంపించే పర్సీవరెన్స్‌రోవర్‌ లక్ష్యం అంగారక గ్రహంపై ఉన్న  జెజిరో క్రాటర్‌గా పిలిచే ప్రాంతాన్ని చేరుకోవడం. అక్కడకే ఎందుకూ అంటే... ఒకప్పుడు నీటితో నిండినదిగా భావిస్తున్న ఈ డెల్టా ప్రాంతంలో పరిశోధనలు చేస్తే అక్కడి ప్రాణికోటి సంచారం గురించిన సమాచారం తెలియొచ్చనేది శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. కానీ అక్కడి వరకూ ఓ రోవర్‌ని పంపించడం అంటే మాటలు కాదు. కోటానుకోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్న తర్వాత అంగారక గ్రహంపై రోవర్‌ ల్యాండ్‌ అవ్వడంలోనే అసలు సవాల్‌ దాగి ఉంది. ఆ ల్యాడింగ్‌ కంట్రోల్‌ వ్యవస్థ బాధ్యతలను స్వాతి తీసుకున్నారు. మార్స్‌ 2020 గైడెన్స్‌, నావిగేషన్‌, కంట్రోల్‌ ఆపరేషన్స్‌ వంటివి ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ మిషన్‌లో భాగమైన జీఎన్‌సీ టీమ్‌ని సైతం ఆమె ముందుండీ నడిపిస్తున్నారు.
‘ఈ ప్రాజెక్టును 2013లో ప్రారంభించాం. ఎనిమిదేళ్ల కష్టం మాది. ఏడు నెలల క్రితం రోవర్‌ అంతరిక్షంలో ప్రయాణం మొదలుపెట్టినప్పట్నుంచీ మాకు సవాల్‌ మొదలైంది. గురువారం రాత్రి మా ప్రయోగం ఫలితాలు అందే సమయం. ల్యాండ్‌ అవ్వడానికి ముందు మేం పడిన టెన్షన్‌ మాటల్లో చెప్పలేనిది. గత ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో శాస్త్రవేత్తలందరినీ ఇళ్లకు వెళ్లిపొమ్మన్నారు. మాకా సమయం చాలా కీలకమైంది. అందుకే నేను ఇంటి నుంచీ పనిచేసేదాన్ని. క్షణం కూడా వృథా చేయలేదు. నా కష్టం ఫలించింది. ఈ రోవర్‌ తీసుకొచ్చే మట్టిపై చేసే పరిశోధనలు మనకెంతో ఉపయోగపడతాయి’ అనే స్వాతికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భారతీయ కట్టూ, బొట్టుకు విలువనిచ్చే స్వాతి తన శిరోజాలని ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. బొట్టుకు విలువనిచ్చే స్వాతిని ప్రపంచంలోని భారతీయులంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Tags :

ఆమ , న-సటన , అర-ణ , త-లక , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121036600 , Nasa

ఆమె మాట... కాసుల మూట!


ఆమె మాట... కాసుల మూట!
ఉదయం పూట వంట చేస్తూనే టీవీలో వచ్చే అంతర్జాతీయ న్యూస్‌పై ఓ కన్నేస్తారు 64 ఏళ్ల భాగ్యశ్రీపాఠక్‌. ఆ ఏదో ఉబుసుకుపోక అనుకుంటే పొరపాటు. అవి విన్న తర్వాతే ఆమె యూట్యూబ్‌లో షేర్‌మార్కెట్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతారు..
కృష్ణా.. రామా అనుకోవాల్సిన వయసులో షేర్‌మార్కెట్‌ గురించి అనర్గళంగా మాట్లాడుతూ యువతకు ట్రేడింగ్‌లో సలహాలు, సూచనలు ఇచ్చే ఈ బామ్మగారి పేరు భాగ్యశ్రీపాఠక్‌. సొంతూరు ముంబయి. మొదట్లో ఉద్యోగం చేసే భాగ్యశ్రీ తర్వాత పిల్లల కోసం వదిలేశారు. వారు కాస్త పెద్దయ్యాక అంటే ఆవిడకు నలభై ఏళ్లు వచ్చాక షేర్‌మార్కెట్‌పై ఆసక్తి పెరిగింది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఆన్‌లైన్‌ సదుపాయం లేకపోవడంతో నేరుగా ఆఫీసులకెళ్లి ట్రేడింగ్‌ మెలకువలు నేర్చుకున్నారు. మొదట్లో ఇలా షేర్‌మార్కెట్‌ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన భాగ్యశ్రీని చూసి మగవాళ్లంతా నవ్వేవారట. కానీ ఆవిడ మాత్రం పట్టుదలతో షేర్‌మార్కెట్‌పై పట్టుని పెంచుకుని ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు యూట్యూబ్‌ సాయంతో నెటిజన్లకు ట్రేడింగ్‌ పాఠాలు నేర్పుతున్నారు. షేర్‌మార్కెట్‌లో రాణించాలంటే పుస్తక పరిజ్ఞానం ఒకటే సరిపోదు. అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన ఉండాలి. అందుకే అంతర్జాతీయ న్యూస్‌పై ఓ కన్నేస్తా అనే భాగ్యశ్రీ బామ్మకి ఇప్పుడు ఆన్‌లైన్‌లో వేలాది మంది అభిమానులున్నారు.
Tags :

ఆమ , మ-ట , క-స-ల , Eenadu , Vasundhara , Article , General , 1002 , 121029710 , Youtube , Share-market