Live Breaking News & Updates on ప ఠ ల

Stay informed with the latest breaking news from ప ఠ ల on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in ప ఠ ల and stay connected to the pulse of your community

మిస్సైల్ పాఠాలు నేర్పింది కలాం!


మిస్సైల్ పాఠాలు నేర్పింది కలాం!
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
‘ఓ అమ్మాయి శాస్త్రవేత్త అవడమా!’ అని ఆశ్చర్యపోయే  రోజుల్లోనే డీఆర్‌డీవోలో అడుగు పెట్టారామె!  డాక్టర్‌ ఏపీజేఅబ్దుల్‌కలాం ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న రోజులవి.. స్వయంగా ఆయనిచ్చిన ధైర్యంతోనే అగ్ని, పృథ్వి వంటి క్షిపణి పరిశోధనల్లో పాల్గొన్నారు.. ఆ స్ఫూర్తినే కొనసాగిస్తూ... కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్‌లో శాటిలైట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు తెలుగింటి ఆడపడుచు రాణీ సురేందర్‌...
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తన అవసరాల కోసం కొత్తగా ఉపగ్రహాలపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు తెలుగు మహిళా శాస్త్రవేత్త రాణి సురేందర్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆమె తన ప్రస్థానం ఇలా వివరించారు. ‘మా స్వస్థలం గుడివాడ దగ్గర కుదరవల్లి. నేను పుట్టింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న కేఆర్కే మూర్తి హెచ్‌ఎంటీలో ఇంజినీర్‌ కావడంతో నేనూ ఆ రంగంపైనే ఆసక్తి పెంచుకున్నా. విజయవాడలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశా. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ పిల్లలు బాగా చదువుకోవాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను డీఆర్‌డీవోలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో అడుగుపెట్టాననిపిస్తుంది. మొదట్లో డీఆర్‌డీవో తనకు కావాల్సిన శాస్త్రవేత్తలని తయారుచేసుకునేందుకు కొన్ని కోర్సులు నిర్వహించేది. అలా నేను గైడెడ్‌ మిస్సైల్స్‌ కోర్సు చదివి.. 1987లో శాస్త్రవేత్తగా చేరా. అప్పుడు మా డైరెక్టర్‌ అబ్దుల్‌ కలాం. అక్కడ చేరిన వెంటనే ఆయనను కలుసుకోవడానికి వెళ్లా. అదే మొదటిసారి ఆయనను చూడటం. ఎంటెక్‌లో నేను చేసింది ప్రాజెక్ట్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ కావడంతో ‘ఈ పనికి నువ్వు సరిగ్గా సరిపోతావు’ అని అన్నారు. నాతో మాట్లాడిన అరగంటలో... ఎన్నో విషయాలు చెప్పారు. అది మొదలు రెండేళ్లపాటు ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనిచ్చిన ప్రోత్సాహం వల్లే నాలో ఉన్న ఎన్నో భయాలు తొలగిపోయాయి. మిసైల్స్‌ తయారీ కోసం అప్పటివరకు మన దేశంలో ఒకే ల్యాబ్‌ ఉండేది. కానీ కలాంగారి చొరవతో ఆర్‌సీఐ(రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌) ఏర్పాటు అయ్యింది. 1989 నుంచి ఆ ల్యాబ్‌లోనే క్షిపణుల కమ్యూనికేషన్‌కు సంబంధించి వాడే సీకర్స్‌పై పరిశోధనలు మొదలుపెట్టా. కలాం నేతృత్వంలోని అగ్ని, పృథ్వి వంటి క్షిపణి పరిశోధనల్లో పాలుపంచుకునే అవకాశం వచ్చింది నాకు.’ అంటారు రాణి.  
ఆ మిస్సైల్‌ నా విజయం...
‘క్షిపణి కోసం పనిచేయడం అంటే మాటలు కాదు. ఏ చిన్నపొరపాటు జరిగినా... దాన్ని సరిచేయడానికి వారాలు.. నెలలు కూడా పడుతుంది. ఇందుకోసం సమయం చూసుకుని పనిచేయలేం. కానీ దేశం కోసం చేసే ఈ పని ఎంతో సంతృప్తినిస్తుంది’ అని అంటారామె. ‘ఒక క్షిపణిలో ఎన్నో ఉప వ్యవస్థలు ఉంటాయి. వాటన్నింటిపైనా అవగాహన ఉన్నప్పుడే  మన పని తేలిక అవుతుంది. శాస్త్రవేత్తగా చేరిన మొదట్లో కష్టం అనిపించినా క్రమంగా అన్నీ తెలుసుకుంటూ ముందడుగు వేశా. ఏదైనా సమస్య తలెత్తితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు, దాన్ని సరిదిద్దేందుకు వారం నుంచి రెండు నెలల సమయం పట్టేది. అలాంటప్పుడు రాత్రీపగలు పనిచేయాల్సి వచ్చేది. నా కెరీర్‌లో రెండు మిసైల్స్‌ కోసం పనిచేశా. 2011లో ‘మిల్లీ మెట్రిక్‌ వేవ్‌’ సీకర్‌ సిస్టమ్‌లో పనిచేయడం నా జీవితంలో సాధించిన పెద్ద విజయం. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులను ఎలాంటి వాతావరణంలోనైనా గుర్తించి ఛేదించగలిగే సామర్థ్యం దీనికుంది.’ అంటూ కెరీర్‌లో తనకెదురయిన సవాళ్లని వివరించారు.
బాబుని అత్తగారికి అప్పగించి...  
‘నెలలు తరబడి కష్టపడి పనిచేసిన తర్వాత  మిసైల్స్‌ని పరీక్షించేందుకు ఒడిశాలోని బాలాసోర్‌ వెళ్లి అక్కడే కొన్ని రోజులు గడపాల్సి వచ్చేది. నేను ఉద్యోగంలో చేరిన మూడునాలుగు నెలల వ్యవధిలోనే ఇంజినీర్‌ సురేందర్‌తో పెళ్లైంది. రెండేళ్లకే బాబు పుట్టాడు. వాడిని మా అత్తగారికి అప్పగించి మిస్సైల్‌ పరీక్షల కోసం వెళ్లేదాన్ని. మిసైల్‌ లాంచ్‌ చేయడం నుంచి ఆ తర్వాత లక్ష్యాన్ని చేరిందా లేదా అని పరీక్షించడం వరకు ఎన్నో పనులుంటాయి. ఇందుకోసం ఒక్కోసారి నెలరోజులు కూడా అక్కడే ఉండిపోవాలి. కుటుంబ సహకారం లేకపోతే ఇవన్నీ చేయగలిగేదాన్ని కాదేమో’ అంటారు రాణి.
అవకాశాలు ఉన్నాయ్‌..
‘మహిళలకు డీఆర్‌డీవోలో చాలా అవకాశాలున్నాయి. ఇక్కడ పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఎప్పుడూ లేదు. ప్రారంభంతో పోలిస్తే ఇప్పడు మహిళా శాస్త్రవేత్తల సంఖ్య బాగా పెరిగింది. కొత్తగా యువ శాస్త్రవేత్తల కోసం ల్యాబ్‌లు కూడా ఏర్పాటు అయ్యాయి. క్షిపణులు, యుద్ధ ట్యాంకుల రూపకల్పనతో పాటూ ... ఉపగ్రహాలు, కృత్రిమ మేధ], క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి వేర్వేరు అంశాలపై డీఆర్‌డీవో పనిచేస్తోంది. రక్షణ రంగంలో అంకుర సంస్థలు ఎన్నో వస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు సవాళ్లను స్వీకరించి మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చూపాలి. మహిళలు సైతం అన్నీ చేయగలరని నిరూపించాలి... ఇదీ రాణి అంతరంగం.
- మల్లేపల్లి రమేష్‌ రెడ్డి, హైదరాబాద్‌
Tags :

మ-స-ల , ప-ఠ-ల , న-ర-ప-ద , కల , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121048821 , Scientist

21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!


21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
అనారోగ్యంపాలైన తండ్రి స్థానంలో కుటుంబానికి అండగా ఉండేందుకు... పశువుల కొట్టంలో అడుగుపెట్టింది శ్రద్ధ...  వ్యాపారం అనే పదానికి అర్థం తెలియని పసివయసులో..   పాలవ్యాపారానికి సంబంధించి పాఠాలు నేర్చుకుంది.. చదువుకుంటూనే, యువ వ్యాపారవేత్తగా మారిన 21 ఏళ్ల శ్రద్ధా ఇప్పుడు యువతకు వ్యాపార పాఠాలు చెబుతోంది....
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిఘోజ్‌ గ్రామానికి చెందిన సత్యాధావన్‌ది పాలవ్యాపారం. అతను పెద్దగా చదువుకోలేదు. అందుకే తన కూతురు శ్రద్ధాధావన్‌, కొడుకు కార్తీక్‌లను బాగా చదివించాలనుకున్నాడు. కానీ అనుకోకుండా వచ్చిన అనారోగ్యంతో అతని పాలవ్యాపారం కుంటుపడింది. చూసేవాళ్లు లేకపోవడంతో ఒక్క పశువుని మాత్రం తన వద్ద ఉంచుకుని, తక్కిన వాటిని అమ్మేశాడు. చూస్తుండగానే కుటుంబ పోషణతోపాటూ పిల్లల చదువులూ అతనికి భారంగా మారాయి. తన తర్వాత తన కుటుంబాన్ని, ఉన్న చిన్నపాటి పాలవ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆ సమయంలో అతని కళ్ల ఎదురుగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే శ్రద్ధాధావన్‌ కనిపించింది. ‘అమ్మా... నువ్వు మన పాలవ్యాపారాన్ని చూసుకోగలవా?’ అని తండ్రి అడగ్గానే ఉత్సాహంగా ఊఁ కొట్టిందా పిల్ల. అప్పటికి ఆ చిన్నారి వయసు 11 ఏళ్లే. అయినా పరిస్థితులను అర్థం చేసుకుని పశువుల కొట్టంలోకి అడుగుపెట్టింది.
వ్యాపారం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పసివయసులో తండ్రిని అడిగి ఎన్నో విషయాలు శ్రద్ధగా అడిగి తెలుసుకునేది. కొట్టాన్ని శుభ్రం చేయడం, పాలు తీయడం వంటి పనులని శ్రద్ధగా చేసేది. సైకిల్‌పై పాలకేంద్రాలకు పాలను తరలించేది. పశువులకు ఆరోగ్య సమస్యలొస్తే పశువైద్యులను సంప్రదించేది. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియపద్ధతిలో పెంచిన గ్రాసాన్ని మాత్రమే వాటికి ఆహారంగా వేసేది. దాంతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు పుష్కలంగా ఇచ్చేవి. దాంతో మిగిలిన పాలను గ్రామంలో అవసరమైనవారికీ అమ్మేది. బాధ్యతలు పెరిగేసరికి సైకిల్‌ని వదిలి బైకు నడపడం నేర్చుకుంది.
రెండు అంతస్థుల్లో పశువుల కొట్టం..
గ్రామంలో బైకుపై తిరుగుతూ పాలను విక్రయించే మొదటి ఆడపిల్ల అయ్యింది శ్రద్ధా. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదామె. స్కూల్‌కు ఒక్కసారికూడా గైర్హాజరు అయ్యేదికాదు. హోంవర్క్‌కు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ పని పూర్తిచేసేది. శ్రద్ధా తమ్ముడు ఆమె కన్నా నాలుగేళ్లు చిన్నోడు. ‘నేను బాగా చదివితేనే, వాడు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటాడు. అందుకే ఓవైపు పాలవ్యాపారాన్నీ, మరోవైపు చదువును సమన్వయం చేసుకుంటున్నాను. ప్రస్తుతం డిగ్రీ పాసయ్యా. ఫిజిక్స్‌ అంటే ఇష్టం. అందుకే ఈ సబ్జెక్ట్‌లో మాస్టర్స్‌  చేయాలనుకుంటున్నా.  నా చేతిలోకి ఈ పాలవ్యాపారం వచ్చేసరికి నా వయసు 11 ఏళ్లే. అప్పటికి మా పశువుల కొట్టంలో ఒక్క పశువు మాత్రమే ఉండేది. ఇప్పుడు 80 వరకు ఉన్నాయి. వీటికోసం రెండు అంతస్థుల్లో పశువుల కొట్టం నిర్మించా. మా గ్రామంలోని రైతుల నుంచి సేంద్రియపద్ధతిలో పండించే గడ్డినే పశువులకు ఆహారంగా తీసుకుంటా. ఈ పదేళ్లలో అనుభవంతోపాటూ ఎన్నో మెలకువలనూ  తెలుసుకున్నా. మావూర్లో అందరూ చదివి, పట్నాలకు వెళుతున్నారు. నేను మాత్రం ఈ పాలవ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తా. త్వరలో పాల ఉత్పత్తుల తయారీని ప్రారంభించాలనుకుంటున్నా. ఈ రంగంలో అడుగుపెట్టినందుకు నేను సిగ్గుపడటం లేదు. కుటుంబ బాధ్యతలను కాస్తంత ముందుగా తీసుకున్నా అంతే. ఇప్పుడు మా డైయిరీ నుంచి రోజుకి 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నాం. వీటిని తరలించడానికి జీపు డ్రైవింగ్‌ కూడా నేర్చుకున్నా. నెలకు ఆరులక్షల రూపాయల ఆదాయం వస్తోంది. యువత ఈ పరిశ్రమలోకి అడుగుపెడితే మరిన్ని విజయాలు సాధించొచ్చు. ఈ రంగంపై అందరికీ అవగాహన కలిగించేదిశగా ఆన్‌లైన్‌లో పలు సంస్థల తరఫున అతిథిగా ప్రసంగిస్తున్నా’ అని చెబుతోంది శ్రద్ధాధావన్‌.
Tags :

21 , ఏళ-లక , వ-య-ప-ర , ప-ఠ-ల , Eenadu , Vasundhara , Article , General , 1002 , 121019417 , Milk-booth